అమెరికాలో పడవ ప్రమాదం.. 39 మంది గల్లంతు
ABN , First Publish Date - 2022-01-27T11:10:20+05:30 IST
అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మానవ స్మగ్లింగ్‌కు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ పడవ కరేబియన్ దేశమైన బహమాస్...

మియామి: అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మానవ స్మగ్లింగ్‌కు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ పడవ కరేబియన్ దేశమైన బహమాస్ నుంచి బయలుదేరినట్టు అధికారులు చెబుతున్నారు. పోర్టుపియర్స్‌కు తూర్పున 72 కిలోమీటర్ల దూరంలో పడవను పట్టుకొని వేలాడుతున్న వ్యక్తిని గుర్తించిన ఓ సమారిటన్ మంగళవారం కోస్టుగార్డ్‌కు ఫోన్‌కాల్ ద్వారా సమాచారం అందిచాడని సముద్ర భద్రతా ఏజెన్సీ తెలిపింది