ప్రయాణికులకు తీపి కబురు.. క్వారెంటైన్ నిబంధనలు సవరించిన హాంగ్ కాంగ్

ABN , First Publish Date - 2022-01-28T21:31:53+05:30 IST

ప్రయాణికులకు హాంగ్ కాంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వె

ప్రయాణికులకు తీపి కబురు.. క్వారెంటైన్ నిబంధనలు సవరించిన హాంగ్ కాంగ్

ఎన్నారై డెస్క్: ప్రయాణికులకు హాంగ్ కాంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


దక్షిణాఫ్రికా‌లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాల్లో కఠిన కొవిడ్ నిబంధనలు తిరిగి అమలులోకి వచ్చాయి. హాంగ్ కాంగ్ కూడా కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్‌కాంగ్‌కు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు హాంగ్‌కాంగ్‌కు చేరుకున్న తర్వాత మూడు వారాలు అంటే 21 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది.కాగా.. ఈ నిబంధనను హాంగ్ కాంగ్ తాజాగా సవరించింది. ప్రయాణికులు స్థానికంగా ఉన్న హోటళ్లలో 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని వెల్లడించింది. క్వారెంటైన్‌ పూర్తైన తర్వాత మరో 7 రోజులపాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించింది. సవరించిన ఈ క్వారెంటైన్ నిబంధనలు ఫిబ్రవరి 5 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే.. సిటీలో అమలవుతున్న కొవిడ్ ఆంక్షల ఫిబ్రవరి 17 వరకు పొడిగించినట్టు తెలిపింది. 
Read more