Hong Kong: హాంగ్‌కాంగ్ కొత్త వీసా స్కీమ్..

ABN , First Publish Date - 2022-11-01T19:42:46+05:30 IST

సిబ్బంది కొరతతో సతమతమవుతున్న హాంగ్‌కాంగ్ విదేశీ నిపుణులను దేశంలోకి ఆకర్షించేందుకు ఓ సరికొత్త వీసా పథకాన్ని ప్రవేశపెట్టింది.

Hong Kong:  హాంగ్‌కాంగ్ కొత్త వీసా స్కీమ్..

ఎన్నారై డెస్క్: సిబ్బంది కొరతతో(labour Shortage) సతమతమవుతున్న హాంగ్‌కాంగ్(Hongkong) విదేశీ నిపుణులను దేశంలోకి ఆకర్షించేందుకు ఓ సరికొత్త వీసా పథకాన్ని(Visa Scheme) ప్రవేశపెట్టింది. ప్రముఖ యూనివర్సిటీల పట్టభద్రులు, అధిక ఆదాయం కలిగిన వృత్తినిపుణుల కోసం టాప్ టాలెంట్ పాస్ స్కీమ్(Top talent pass scheme) పేరిట ఇటీవలే ఈ వీసాను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 యూనివర్సిటీల్లో చదివి, సంబంధిత రంగాల్లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్న వాళ్లు ఈ వీసాకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం కనీసం 3,18,000 డాలర్లు ఉండాలి. ఇటీవల ప్రతిభావంతులైన వృత్తినిపుణులు దేశాన్ని వీడుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు హాంగ్‌కాంగ్ ఈ వీసాను ప్రకటించింది. ఇది భారతీయులకూ ఎంతో లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం.. హాంగ్‌కాంగ్‌లో 42 వేల మంది భారతీయులు(Indians) నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 33 వేల మందికి భారత పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇటీవల కాలంలో భారతీయులు అధిక సంఖ్యలో హాంగ్‌కాంగ్‌కు తరలి వెళుతున్నారు. అక్కడి సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, షిప్పింగ్, తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇక గతేడాది 1034 మంది భారతీయులకు హాంగ్‌కాంగ్ వీసాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో మరో 560 వీసాలను అక్కడి ప్రభుత్వం జారీ చేసింది. అయితే.. కరోనా సంక్షోభానికి మునుపు 2019లో 2684 మంది భారతీయులు హాంగ్‌కాంగ్ వీసాలు పొందారు. భారతీయ వృత్తినిపుణులు ఆసక్తి కనబరుస్తున్న దేశాల్లో హాంగ్‌కాంగ్ కూడా ఒకటని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇటీవల ప్రచురించింది. ఇక ప్రపంచస్థాయి కలిగిన ఆర్థిక కేంద్రంగా హాంగ్‌కాంగ్ ఎదగడంలో అక్కడి భారతీయులు పాత్ర ఎంతో ఉంది.

Updated Date - 2022-11-01T19:51:02+05:30 IST