గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం సభ్యులకు సేవా అవార్డుల ప్రదానం!
ABN , First Publish Date - 2022-05-16T02:30:14+05:30 IST
కరోనా వైరస్ విలయం సమయంలో అనేక మందికి వైద్యపరమైన సహాయసహకారాలు అందించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు అవార్డులతో సత్కరించారు.
కరోనా వైరస్ విలయం సమయంలో అనేక మందికి వైద్యపరమైన సహాయసహకారాలు అందించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు అవార్డులతో సత్కరించారు. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం(GWTS) ప్రెసిడెంట్ సాయిసుధ పాలడగ, Team సభ్యులు రవి వెనిగళ్ళ, గోపాల్ సీలమనేని, ప్రసాద్, వంశీ రామ్ చౌదరి అవార్డులు అందుకున్నారు. GWTS సభ్యులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. కరోనా వైరస్ విలయంలో వారి సేవలు అమోఘం. అప్పట్లో వేలాది కరోనా కిట్లు, మందులు, ఆహారం పంపిణీ చేశారు.