ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-07T18:07:41+05:30 IST

ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలు

ఎన్నారై డెస్క్: ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుమారు వంద కుటుంబాలు పాల్గొన్నాయి. ముందుగా గౌరీ దేవి,  గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆడపడుచులు రజిత, స్వాతి, ప్రియాంక, కమల, సునీత, క్రాంతి, సాధ్విక, ప్రియా, హిమ బాల తదితరులు బతుకమ్మను పేర్చి, ఉయ్యాల పాటలు పాడుతూ ఆడారు.


ఇందులో ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్, శ్రీనివాస కళ్యాణం ప్రెసిడెంట్ కన్నబిరేం, మలయాళం అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్‌తో పాటు రవి, నవీన్, శ్రీని, నర్సింహా, శ్రీకాంత్, ప్రేమ్ సాయి, సంతోష్ దిలీప్, విక్రమ్, హరి, విజయ్, రామ్, కిశోరె, దిలీప్, చంద్ర, అఖిల్, తరుణ్ తదిరులు పాల్గొన్నారు. 

Read more