Free Condoms: 18-25ఏళ్ల యువతకు కండోమ్‌లు ఫ్రీ.. దేశాధ్యక్షుడి ప్రకటన!

ABN , First Publish Date - 2022-12-09T15:47:26+05:30 IST

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే జనవరి నుంచే యువత.. దేశంలోని ఫార్మసీల ద్వారా ఉచిత కండోమ్‌(Free Condoms)లను తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో..

Free Condoms: 18-25ఏళ్ల యువతకు కండోమ్‌లు ఫ్రీ.. దేశాధ్యక్షుడి ప్రకటన!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని యువతకు ఫ్రీగా కండోమ్‌లు అందించినట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే జనవరి నుంచే యువత.. దేశంలోని ఫార్మసీల ద్వారా ఉచిత కండోమ్‌(Free Condoms)లను తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఆ దేశం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్(Emmanuel Macron) గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫార్మసీల ద్వారా జనవరి 1 నుంచి 18-25ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఉచిత కండోమ్‌లను పొందవచ్చు’ అని ప్రకటించారు. లైంగిక సంబంధ వ్యాధులను, జనాభా నియంత్రణను దృష్టిలో పెట్టుకునే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగిక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 30శాతం పెరిగిందట.

Updated Date - 2022-12-09T15:59:39+05:30 IST