Texas Schoolలో 21 మందిని చంపిన ఈ కుర్రాడి కుటుంబం నుంచి కొత్త విన్నపం.. విరాళాలు ఇవ్వండంటూ..

ABN , First Publish Date - 2022-06-01T23:30:09+05:30 IST

టెక్సాస్ స్కూల్‌లో నరమేధం సృష్టించిన 18ఏళ్ల కుర్రాడి కుటుంబం ప్రస్తుతం కొత్త విన్నప్పం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీనంగా విరాళాలు అభ్యర్థిస్తోంది. అయితే ఈ అభ్యర్థనకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు స్పం

Texas Schoolలో 21 మందిని చంపిన ఈ కుర్రాడి కుటుంబం నుంచి కొత్త విన్నపం.. విరాళాలు ఇవ్వండంటూ..

ఎన్నారై డెస్క్: టెక్సాస్ స్కూల్‌లో నరమేధం సృష్టించిన 18ఏళ్ల కుర్రాడి కుటుంబం ప్రస్తుతం కొత్త విన్నప్పం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా దీనంగా విరాళాలు అభ్యర్థిస్తోంది. అయితే ఈ అభ్యర్థనకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు స్పందిస్తున్నారు. వారికి తోచిన సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం ఆ కుర్రాడి కుటంబం విరాళాలను ఎందుకు సేకరిస్తోంది అనే వివరాల్లోకి వెళితే..


సాల్వడర్‌ రామోస్‌ అనే 18ఏళ్ల కుర్రాడు.. మే 24న టెక్సాస్‌లోని యువాల్డే పట్టణంలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో నరమేధం సృష్టించాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.32 గంటలకు పాఠశాలలోకి ప్రవేశించి.. కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 19 విద్యార్థులు సహా.. ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి అనంతరం.. పోలీసులు జరిపన కాల్పుల్లో రామోస్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. స్కూల్‌లో విధ్వంసం సృష్టించడానికి ముందే.. రామోస్ తన నాయనమ్మపై కాల్పులు జరిపాడు. 



ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు కొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. అందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. సుమారు 30,000 డాలర్ల డబ్బు అవసరం అవుతుందని చెప్పారు. దీంతో రామోస్ ఆంటీ.. తన తల్లిని బ్రతికుంచుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం అవసరమయ్యే మొత్తాన్ని విరాళాల రూపంలో అందించాలని  GoFundMe పేజీ ద్వారా అభ్యర్థించారు. అయితే న్యాయాన్యాయాలు దేవుడికి వదిలేయాలని.. అన్ని రకాలుగా దెబ్బతిన్న తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు.. విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు 10,000 డాలర్లు విరాళాల రూపంలో జమయ్యాయి. 


Updated Date - 2022-06-01T23:30:09+05:30 IST