కొడుకును చివరిసారిగా చూడాలని తల్లి.. కాదు అక్కడే అంత్యక్రియలు చేయలని భార్య.. 7 నెలలుగా..

ABN , First Publish Date - 2022-10-17T17:51:34+05:30 IST

అందరిలాగే అతడు కూడా డబ్బులు బాగా సంపాదించాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఎడాది దేశం బాట పట్టాడు. కరోనా ప్రభలడంతో ఇంటికి తిరిగొచ్చిన అతడు.. గత ఏడాది తిరిగి విదేశాలకు వె

కొడుకును చివరిసారిగా చూడాలని తల్లి.. కాదు అక్కడే అంత్యక్రియలు చేయలని భార్య.. 7 నెలలుగా..

ఎన్నారై డెస్క్: అందరిలాగే అతడు కూడా డబ్బులు బాగా సంపాదించాలని.. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఎడాది దేశం బాట పట్టాడు. కరోనా ప్రభలడంతో ఇంటికి తిరిగొచ్చిన అతడు.. గత ఏడాది తిరిగి విదేశాలకు వెళ్లాడు. అలా వెళ్లిన అతడు అక్కడే తుది శ్వాస విడిచాడు. అంత్యక్రియల విషయంలో అతడి తల్లి, భార్య ఏకాభిప్రాయానికి రాకపోవడంతో.. గత ఏడు నెలలుగా అతడి మృతదేహం మార్చురీలోని ఫ్రీజర్‌లోనే భద్రపర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని షాజహాన్‌పూర్‌కు చెందిన 35ఏళ్ల మహ్మద్ ఆలం.. ఉపాధి కోసం తొలిసారిగా 2013లో సౌదీ అరేబియా వెళ్లాడు. ఈ క్రమంలోనే ఏడాదికి ఒకసారి స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవాడు. అలా ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు.. ఫర్హీన్(Farheen) అనే మహిళతో అతడికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా భార్యను ఇండియాలోనే వదిలిపెట్టి అతడు సౌదీ వెళ్లిపోయాడు. 



ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సందర్భంగా అతడు చివరిసారిగా స్వదేశానికి వచ్చాడు. దాని ప్రభావం తగ్గడంతో గత ఏడాది తిరిగి సౌదీ పయనమయ్యాడు. అలా వెళ్లిన ఆలం.. తిరిగి ఇండియా(India)కు రాలేదు. ఈ ఏడాది మార్చి 30న ప్రమాదవశాత్తు ఆలం సౌదీ(Saudi Arabia)లో మరణించాడు. ఈ విషయం ఆగస్ట్ 24న కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఆలం భార్య ఫర్హీన్, అతడి తల్లి 85ఏళ్ల మర్యమ్ భేగం(Maryam Begum) మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కన్నకొడుకును చివరిసారిగా చూసుకోవాలని, స్వస్థలంలో అతడికి అంత్యక్రియలు నిర్వహించాలని మర్యమ్ భేగం భావిస్తోంది. ఆలం మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. కానీ ఆలం భార్య మాత్రం.. తన భర్త అంత్యక్రియలను సౌదీలోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. దీంతో అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఫలితంగా దాదాపు 7 నెలలుగా ఆలం మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది. 


Updated Date - 2022-10-17T17:51:34+05:30 IST