రోడ్డు పక్కన కనిపించిందో బ్యాగ్.. ఓపెన్ చేస్తే కట్టలకొద్దీ డబ్బు.. రూ.6.50 లక్షలకు పైగా కరెన్సీని చూసి అతడేం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-08-15T16:40:38+05:30 IST
ఏదో పని మీద వెళ్తున్న అతడికి రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. దీంతో తొలుత భయాందోళనలకు గురైన అతడు.. ఆ తర్వాత ధైర్యం చేశాడు. బ్యాగులో ఓపెన్ చేసి ఏముందో చూద్దామని భావించాడు. వెంటనే బ్యాగు దగ్గరకు వెళ్లాడు. దాన్ని చేతుల్లోకి తీసు

ఇంటర్నెట్ డెస్క్: ఏదో పని మీద వెళ్తున్న అతడికి రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. దీంతో తొలుత భయాందోళనలకు గురైన అతడు.. ఆ తర్వాత ధైర్యం చేశాడు. బ్యాగు ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దామని భావించాడు. వెంటనే బ్యాగు దగ్గరకు వెళ్లాడు. దాన్ని చేతుల్లోకి తీసుకుని.. ఓపెన్ చేశాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. కట్టలకొద్దీ డబ్బు చూసి విస్తుపోయాడు. అనంతరం అతడు ఆ డబ్బును ఏం చేశాడనే పూర్తి వివరాల్లోకి వెళితే..
సాహిల్ అల్ నమీ(Sahil Al Nami) అనే వ్యక్తి దుబాయ్(Dubai)లో నివసిస్తున్నాడు. ఈయన తాజాగా ఓ పని మీద వెళ్తూ.. రోడ్డు పక్కన ఓ బ్యాగును గమనించాడు. ఈ క్రమంలోనే ఆ బ్యాగు(Cash Bag) వద్దకు వెళ్లి.. అనుమానంగా దాన్ని ఓపెన్ చేశాడు. బ్యాగులో 31వేల దిర్హమ్ల విలువైన నోట్ల కట్టలు (సుమారు రూ.6.70లక్షలకుపైగా) చూసి విస్తుపోయాడు. అనంతరం బ్యాగుతోపాటు బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్(Bur Dubai Police Station)కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న అధికారులకు విషయాన్ని వివరించి.. బ్యాగును పోలీసులకు అందజేశాడు. ఈ నేపథ్యంలో సాహిల్‌ను స్టేషన్ డైరెక్టర్ ప్రశంసించారు. అతడు చూపిన నిజాయితీని మెచ్చుకుంటూ.. ఓ సర్టిఫికెట్‌ను అందజేశారు. దీంతో సాహిల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసు అధికారులు తనను అభినందించడటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.