Viral News: పాకిస్థానీ యువకుడి వీడియో చూసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఫిదా.. యూఏఈకి చేరుకున్న వెంటనే ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-08-13T17:26:15+05:30 IST
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడి వీడియో.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మౌక్తమ్(Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) కంట పడింది. ఆ వీడియో చూసి క్రౌన్ ప్రిన్స్ ఫిదా అయ్యా

ఎన్నారై డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడి వీడియో.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మౌక్తమ్(Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) కంట పడింది. ఆ వీడియో చూసి క్రౌన్ ప్రిన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా యువకుడిని అభింనదించారు. అంతేకాకుండా యూకే నుంచి యూఏఈకి తిరిగొచ్చిన వెంటనే.. ఆ యువకుడికి ఇచ్చిన మాటలను నిబెట్టకున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్‌కు(Pakistan) చెందిన అబ్దుల్ ఘఫూర్(Abdul Ghafoor) దుబాయ్‌లో డెలివరీ బాయ్ పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే తాజాగా ఉద్యోగానికి వెళ్లిన అతడు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. ఈ క్రమంలోనే అతడు.. నడి రోడ్డుపై భారీ సైజ్‌లో ఉన్న రెండు సిమెంట్ ఇటుకలు పడి ఉండటాన్ని గమనించాడు. ఆ ఇటుకల వల్ల రోడ్డు ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన అతడు.. వెంటనే అక్కడకు వెళ్లి.. వాటిని రోడ్డుపై నుంచి తొలగించాడు. అనంతరం గ్రీన్ సిగ్నల్ పడగానే తన దారిన తాను వెళ్లిపోయాడు.
అయితే ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ అయింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్(Dubai Crown Prince) కంట పడింది. దీంతో ఆయన స్పందిస్తూ.. యువకుడి వివరాలు తెలియజేయాలంటూ పోస్ట్ పెట్టారు. అబ్దుల్ ఘఫూర్ ఫోన్ నెంబర్ తెలిసిన వెంటనే.. అతడికి ఫోన్ చేసి అభినందించారు. అంతేకాకుండా యూఈఏకి వచ్చిన వెంటనే కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలో.. గురువారం రోజు యూకే నుంచి యూఏఈకి చేరుకున్న క్రౌన్ ప్రిన్స్.. అబ్దుల్‌ను మీట్ అయ్యారు. అతడు చేసిన పనికి అభినందించి భుజం తట్టారు. అంతేకాకుండా.. అబ్దుల్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. అబ్దుల్‌ను కలిసిన ఫొటోను క్రౌన్ ప్రిన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. క్రౌన్ ప్రిన్స్‌ను కలవడం పట్ల అబ్దుల్ ఆనందం వ్యక్తం చేశారు.