భార్య పిల్లలతో కలిసి Golden Temple కు బయల్దేరిన NRI.. దారి మధ్యలో జరిగిందో ఘోరం.. చివరికి

ABN , First Publish Date - 2022-06-13T19:28:09+05:30 IST

అతనో ఎన్నారై. పన్నేండేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్వదేశానికి వచ్చి వెళ్తుండేవాడు.

భార్య పిల్లలతో కలిసి Golden Temple కు బయల్దేరిన NRI.. దారి మధ్యలో జరిగిందో ఘోరం.. చివరికి
నిందితులు హర్షదీప్, వరిందర్..

అమృత్‌సర్: అతనో ఎన్నారై. పన్నేండేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్వదేశానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇటీవలే భార్య, పిల్లలను చూసేందుకు స్వదేశానికి వచ్చాడు. రెండు రోజులు గడిచాక అమృత్‌సర్‌లోని Golden Temple కు వెళ్దామని భార్య పిల్లలను తీసుకుని బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో వారు వెళ్తున్న బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎన్నారై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అతనితో పాటు వెళ్లిన భార్యను మొదట ప్రశ్నించారు. ఆమె చెప్పిన పొంతనలేని సమాధానాలు వారి అనుమానాన్ని మరింత బలపరిచింది. అంతే.. ఆమెను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఆమె చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎన్నారై నిజంగానే రోడ్డుప్రమాదంలో చనిపోయాడా? భార్య పోలీసుల విచారణలో చెప్పిన నిజాలేంటి? అనే విషయాలు తెలియయాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


వివరాల్లోకి వెళ్తే.. సత్నాం కౌర్, హరిందర్ సింగ్ భార్యభర్తలు. వీరిది అమృత్‌సర్ పరిధిలోని ఘన్‌పూర్ కాలే గ్రామం. హరిందర్ ఉపాధి నిమిత్తం 12 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అప్పడప్పుడు స్వదేశానికి వచ్చి కొన్ని రోజులు భార్య, పిల్లతో ఉండి వెళ్తుండేవాడు. అయితే, భర్త దూరంగా ఉండడంతో భార్య సత్నాంకు అదే గ్రామానికి చెందిన అర్షదీప్ సింగ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇటీవల స్వదేశానికి వచ్చిన హరిందర్‌కు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దాంతో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? అనే తెలుసుకునేందుకు నిఘా పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సత్నాంకు ఇక తన విషయం ఎన్నో రోజులు దాగదని అర్థమైంది. దాంతో ప్రియుడితో కలిసి హరిందర్‌ను మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది. ఇద్దరు కలిసి రూ.2.70లక్షలు పెట్టి వరిందర్ అనే సుపారీ కిల్లర్‌ను ఆశ్రయించారు. అదునుచూసి ఎవరికి అనుమానం రాకుండా భర్త అడ్డుతొలగించాలని వరిందర్‌కు చెప్పింది. అవకాశం కోసం చూస్తున్న ఆమెకు భర్త గోల్డెన్ టెంపుల్ వెళ్దామని చెప్పడంతో  ఆ విషయాన్ని ముందే హర్షదీప్‌కు చేరవేసింది. దాంతో స్వర్ణదేవాలయానికి వెళ్లే దారిలోనే హరిందర్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. 


ఆ తర్వాతి రోజు హరిందర్ భార్య సత్నాం, ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని తెల్లవారు జామున 3.30 గంటలకు టెంపుల్‌కు బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లాక వారి బైక్‌ను అడ్డగించిన వరిందర్, అర్షదీప్ కావాలనే హరిందర్‌తో గొడవకు దిగారు. దాంతో హరిందర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని బైక్ తీసేందుకు యత్నించాడు. వెంటనే వరిందర్, అర్షదీప్ తమ వాహనంతో బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన హరిందర్ ఊపిరితో ఉండడం చూసి తుపాకీతో కాల్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. సత్నాం మాత్రం తనకేమి తెలియనట్టుగా అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయినట్టు చెప్పింది. 


ఆమె సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి వచ్చిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న హరిందర్‌‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో సత్నాంను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సమాధానాలు పోలీసుల అనుమానాల్ని మరింత బలపరిచాయి. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో జరిగిన కథ మొత్తం చెప్పింది. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె కథ నడిపించిన తీరు కుటుంబ సభ్యులను సైతం షాక్‌కు గురిచేసింది. వెంటనే పోలీసులు వరిందర్, అర్షదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-06-13T19:28:09+05:30 IST