సింగపూర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన మాజీ మంత్రి దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-06-19T23:55:52+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు.. సింగపూర్‌లోని సివిల్ సర్వీస్ క్లబ్ టేసన్ సోన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

సింగపూర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన మాజీ మంత్రి దేవినేని ఉమా

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు.. సింగపూర్‌లోని సివిల్ సర్వీస్ క్లబ్ టేసన్ సోన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మరో మాజీ మంత్రి కే.ఎస్.జవహర్‌తో కలిసి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు, తెలుగు వారికి అయన చేసిన సేవలను గుర్తు చేసుకొని సభికులు ఆనందించారు. యావత్ సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో మారుమ్రోగింది. 


కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ దారుణాలు, దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అక్కడి ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇవ్వగలిగిన నేర్పు, సత్తా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2022-06-19T23:55:52+05:30 IST