గల్ఫ్‌లో మళ్లీ కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-06-13T13:15:18+05:30 IST

గల్ఫ్‌ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా యి. దుబాయ్‌లో గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.

గల్ఫ్‌లో మళ్లీ కరోనా కలకలం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా యి. దుబాయ్‌లో గత 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో ఒక్క రోజే 1249 కొత్త కేసులు నమోదైనట్లు ప్ర భుత్వం వెల్లడించింది. కొంత కాలంగా 500 లోపు ఉన్న రోజు వారీ కేసులు కొన్ని రోజులుగా 1000 దాటుతుండగా శనివారం ఒక్కసారిగా 1249కు చేరుకున్నాయి. అయితే, ఈ వారం రోజుల్లో ఎవరూ మరణించలేదు. సౌదీ అరేబియాలోనూ కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 905 కొత్త కేసులను నమోదు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దేశంలో ఇప్పటి వరకు 9173 మంది కరోనాతో చనిపోయారు.

Updated Date - 2022-06-13T13:15:18+05:30 IST