మాస్కు పెట్టుకోవాలి.. ఆ తరువాతే శృంగారం.. ప్రేమికులకు ఆరోగ్యశాఖ అధికారుల మార్గదర్శకాలు!

ABN , First Publish Date - 2022-02-13T03:21:11+05:30 IST

ప్రేమికుల దినోత్సవం ఇంకా రెండు రోజులే ఉన్న నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌ దేశంలో జారీ అయిన కరోనా మార్గదర్శకాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

మాస్కు పెట్టుకోవాలి.. ఆ తరువాతే శృంగారం..  ప్రేమికులకు ఆరోగ్యశాఖ అధికారుల మార్గదర్శకాలు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికుల దినోత్సవం ఇంకా రెండు రోజులే ఉన్న నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌ దేశంలో జారీ అయిన కరోనా మార్గదర్శకాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ‘‘కరోనా అనేది శృంగారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాదు. అయితే.. శ్వాస ద్వారా, లాలాజలం ద్వారా ఒకరినుంచి మరొకరికి పాకే అవకాశం ఉంది. కాబట్టి.. యువతీయువకులు కుదిరితే మాస్కులు ధరించి శృంగారంలో పాల్గొనాలి’’ అంటూ బ్యూరో ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ విభాగం డైరెక్టర్ డా. బున్యారిట్ సుక్రత్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రేమికులు కరోనా టెస్టులు చేయించుకున్నాకే షికార్లకు వెళ్లాలని కూడా అక్కడి అధికారులు సూచించారు. 


కాగా.. గతేడాది సురక్షిత శృంగారం పేరిట అక్కడి అధికారులు చేసిన సూచనలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. ఒకరి ముఖం మరొకరికి దగ్గరగా రాకుండా ఉండే శృంగార భంగిమను ఎంచుకోవాలంటూ అధికారులు సూచించడం చర్చనీయాంశమైంది. అయితే.. ప్రజల అవసరాలకు సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతోనే ఇలాంటి మర్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్ అప్పట్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-02-13T03:21:11+05:30 IST