ప్రతి తరంలో చైనా 40 శాతం జానాభాను కోల్పోనుంది: ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-06-08T02:54:58+05:30 IST

చైనాలో భారీగా తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చైనా ప్రతి తరంలో 40 శాతం జనాభాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రతి తరంలో చైనా 40 శాతం జానాభాను కోల్పోనుంది: ఎలాన్ మస్క్

ఎన్నారై డెస్క్: చైనాలో భారీగా తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చైనా ప్రతి తరంలో 40 శాతం జనాభాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చైనా సంతానోత్పత్తిపై ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా షేర్ చేశారు. ‘‘చైనా ఇప్పటికీ అనేక మంది ‘ఒకే బిడ్డ’ విధానాన్ని పాటిస్తోందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ..చైనా జంటలు ముగ్గురు పిల్లలు కనవచ్చంటూ అక్కడి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయినా కూడా గతేడాది అక్కడి సంతానోత్పత్తి రేటు మునుపెన్నడూ చూడనిస్థాయికి పడిపోయింది. పరిస్థితి ఇదే తీరులో కొనసాగితే.. చైనా ప్రతి తరానికి 40 శాతం జనాభాను కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.  Updated Date - 2022-06-08T02:54:58+05:30 IST