దుబాయ్ గురుద్వారాను సందర్శించిన సీజేఐ ఎన్‌వీ రమణ

ABN , First Publish Date - 2022-03-19T17:09:49+05:30 IST

యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ శుక్రవారం దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు.

దుబాయ్ గురుద్వారాను సందర్శించిన సీజేఐ ఎన్‌వీ రమణ

దుబాయ్: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ శుక్రవారం దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, హిమా కోహ్లి కూడా గురు నానక్ దర్బార్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గురుద్వారా ఛైర్మన్ సురేందర్ సింగ్ కాంధారి వారికి ప్రసాదాలతో పాటు మెమొంటోలు అందజేశారు. అంతకుముందు గురువారం అబుదాబిలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో ఎన్‌వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో భారతీయ ప్రవాసులు ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. అలాగే అబుదాబిలోని యూఏఈ యూనియన్ సుప్రీంకోర్టును సీజేఐ సందర్శించారు. చీఫ్ జస్టిస్ మహ్మద్ అహ్మద్ అల్ బది ఆహ్వానం మేరకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి రమణ వెళ్లడం జరిగింది. 
Updated Date - 2022-03-19T17:09:49+05:30 IST