అగ్నికి ఆహుతైన ఎన్నారై వ్యక్తి భార్యాబిడ్డలు..!

ABN , First Publish Date - 2022-04-06T02:54:50+05:30 IST

ఓమన్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్యాబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూర్తిగా కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి.

అగ్నికి ఆహుతైన ఎన్నారై వ్యక్తి భార్యాబిడ్డలు..!

ఎన్నారై డెస్క్: ఓమన్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్యాబిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూర్తిగా కాలిపోయిన తల్లీబిడ్డల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. కేరళలోని పథనంతిట్ట నగరంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. మృతులను రిన్సా(21), ఎల్హానా(3)గా పోలీసులు గుర్తించారు. రిన్సా భర్త సాజూ మస్కట్‌లో ఉన్నారు. ఆయన భార్యాబిడ్డలు ఒంటరిగానే ఆ ఇంట్లో నివసించేవారు.  వాళ్లిద్దరిని చివరిసారిగా సోమవారం ఉదయం చూసామని ఇరుగుపొరుగు తెలిపారు.


సోమవారం సాయంత్రం సాజూ సోదరుడి కుమార్తె.. రిన్సా ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకీ తలుపు తెరుచుకోలేదు. దీంతో.. అనుమానం వచ్చిన ఆమె తన తండ్రికి సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించగా.. మంటల్లో కాలిపోయిన  తల్లీబిడ్డల మృతదేహాలు కనిపించాయి. కాగా.. ఇంట్లో కిరోసిన్ వాసన కూడా వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఎటువంటి సూసైడ్ నోట్ వారికి లభించలేదు. పోస్ట్ మార్టం పూర్తయ్యాకే ఈ ఘటన వెనుక గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-04-06T02:54:50+05:30 IST