ఈ యువతి చేసిన పని చూసి.. ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో మీరే చూడండి

ABN , First Publish Date - 2022-01-20T01:39:04+05:30 IST

ఓ యువతి చేసిన పని.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుడంటంతో.. నెటిజన్లు స్పందిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు

ఈ యువతి చేసిన పని చూసి.. ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకో మీరే చూడండి

ఎన్నారై డెస్క్: ఓ యువతి చేసిన పని.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుడంటంతో.. నెటిజన్లు స్పందిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత కూడా భయం లేకుండా అలా చేసిందేంటి అని చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఆ యువతి ఎవరు? ప్రపంచ మొత్తం మాట్లాడుకునేలా ఆమె ఏం ఘనకార్యం చేసింది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..కెనడా వ్యాప్తంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో అక్కడి సరస్సులు, నదులు గడ్డకట్టుకుని పోయాయి. ఈ క్రమంలోనే గడ్డకట్టిన రైడో నదిపై ఓ యువతి.. కారు డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అయితే ఉన్నట్టుండి ఆమె నడుపుతున్న కారు.. నదిలో చిక్కుకుపోయింది. క్రమంగా కారు నదిలోకి మునగడం ప్రారంభమైంది. ఈ సందర్భంలో సాధరణంగా ఎవరైనా.. భయాందోళనలకు గురవుతాం. ప్రాణాలతో బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ సదరు యువతి మాత్రం.. పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. ఎంచక్కా.. కారు మునిగిపోతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. కారుపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేసింది. యువతి ప్రవర్తన చూసి స్థానికులు తొలుత షాకైనా.. ఆ తర్వాత ఆమెను ప్రమాదం నుంచి రక్షించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఆ యువతి వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 

Read more