Kuwait లో భారత ప్రవాసుడు మృతి
ABN , First Publish Date - 2022-05-21T15:23:43+05:30 IST
కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశాడు.

కువైత్ సిటీ: కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశాడు. భావన్స్ కువైత్ అనే ఇండియన్ స్కూల్లో నాన్-టీచింగ్ స్టాఫ్‌గా పనిచేసే కేఎస్ సునీల్ కుమార్(45) శుక్రవారం మధ్యాహ్నం(కువైత్ స్థానిక కాలమానం ప్రకారం) చనిపోయాడు. వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. చివరికి ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కేరళ రాష్ట్రం చెర్తలకు చెందిన సునీల్ గత 15 ఏళ్లుగా భావన్స్ కువైత్ స్కూల్లో ఆడియో వీడియో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ మృతిపట్ల భావన్స్ కువైత్ పాఠశాల యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.