TANA: తానా ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ‘బంగారు బతుకమ్మ’

ABN , First Publish Date - 2022-10-08T02:00:10+05:30 IST

తానా ఆధ్వర్యంలో అక్టోబర్ 8న బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.

TANA: తానా ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ‘బంగారు బతుకమ్మ’

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా-TANA) ఆధ్వర్యంలో అక్టోబర్ 8న బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. న్యూయార్క్ నగరంలోని డఫ్పీ స్క్వేర్ ఈ వేడుకలకు వేదిక కానుంది. బంగారు బతుకమ్మ పేరిట జరుగుతున్న ఈ వేడుకలకు తానా(TANA) అన్ని ఏర్పాట్లు చేసింది. న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు.  ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కూడా ఈ సంబురాల్లో అతిథిగా పాల్గొంటారు.  ప్రముఖ సింగర్ మంగ్లీ, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్ ఈ వేడుకలో పాల్గొని ఆహుతులను అలరించనున్నారు. ఈ సందర్భంగా తానా..  తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ఆటా పాటా’, ‘కోలాటం’, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా బతుకమ్మ తెచ్చిన వారికి పట్టు చీరలు బహూకరించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు సంస్థ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తానా కోరింది. 





Updated Date - 2022-10-08T02:00:10+05:30 IST