ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్న భారతీయులు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-12T03:12:19+05:30 IST

భారతీయ టూరిస్టులను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా.. అనుకున్న ఫలితాన్ని క్రమంగా సాధిస్తోంది.

ఆస్ట్రేలియాకు క్యూ కడుతున్న భారతీయులు.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని అనేక దేశాలకు పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరు. అయితే.. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయిన టూరిజం రంగం.. ఇప్పుడిప్పుడే కోలుకోవడం ప్రారంభించింది. రెండేళ్లుగా ఇంటి నుంచి కాలు బయటపెట్టని ప్రజలు.. కరోనా ఆంక్షలు సడలుతున్న నేపథ్యంలో విదేశీ టూర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ టూరిస్టులను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా.. అనుకున్న ఫలితాన్ని క్రమంగా సాధిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం అనేక మంది భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆస్ట్రేలియా టూరిస్టు వీసా కోసం భారతీయుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటమే ఇందుకు ఉదాహరణ.


 కరోనా ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల కాలంలో పలు రకాల చర్యలు చేపట్టింది.  కరోనా ఆంక్షల కారణంగా తమ వీసాను వినియోగించుకోలేకపోయిన వారికి ఉచిత విజిటర్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. అంతేకాకుండా.. మార్చి 2020-జూన్ 2022 మధ్య కాలంలో వీసా గడువు ముగిసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసాలకు డిమాండ్ పెరిగింది.

Updated Date - 2022-03-12T03:12:19+05:30 IST