గల్ఫ్‌దేశాల్లో ఖైదీలుగా 4వేల మంది భారతీయులు.. ఇంతకూ వాళ్లు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే..
ABN , First Publish Date - 2022-02-14T13:59:34+05:30 IST
ఉపాధి కోసం భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారన్న విషయం తెలిసిందే. కాగా.. గల్ఫ్‌దేశాల్లో స్థానిక చట్టాలను ఉల్లఘించి లేక ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 4వేల మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలకు చెందిన స్థానిక మీడియా తాజాగా వెల్లడించింది. సౌదీ అరేబియాలో..

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారన్న విషయం తెలిసిందే. కాగా.. గల్ఫ్‌దేశాల్లో స్థానిక చట్టాలను ఉల్లఘించి లేక ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 4వేల మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలకు చెందిన స్థానిక మీడియా తాజాగా వెల్లడించింది. సౌదీ అరేబియాలో అత్యధికంగా 1570 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్టు పేర్కొంది. యూఏఈలో 1292 మంది భారతీయులు జైలు జీవితం అనుభవిస్తున్నట్టు వెల్లడించింది. ఇదే విధంగా.. కువైత్‌లో 460 మంది, ఖతార్‌లో 439 మంది, బహ్రెయిన్‌లో 178 మంది, ఒమన్‌లో 49 మంది భారతీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు తెలిపింది. స్థానిక చట్టాలను ఉల్లఘించిన నేరంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8వేల మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్టు పేర్కొంది. విదేశాల్లో అన్యాయంగా జైలు పాలైన భారతీయులకు అవసరమైన లీగల్ సహాయాన్ని భారత ప్రభుత్వం అందిస్తున్నట్టు వివరించింది.