America: టీడీపీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రవాసాంధ్రుల కృషి అవసరం: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2022-08-18T01:55:10+05:30 IST
అమెరికా పర్యటనలో ఉన్నమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswararao)ని ఈ నెల 16న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగుదేశం పార్టీ(Telugu Desham Party) అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ

ఎన్నారై డెస్క్: అమెరికా పర్యటనలో ఉన్నమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswararao)ని ఈ నెల 16న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగుదేశం పార్టీ(Telugu Desham Party) అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిస్వార్ధంగా సేవలందిస్తున్న దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకులు.. తెలుగు దేశం పార్టీకి వెన్నుముక లాంటివారన్నారు. ఎన్టీఆర్(NTR) స్ఫూర్తితో చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu) నాయకత్వంలో పార్టీ పునర్వైభవం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడారు. ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసాంధ్రులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పట్టాలు తప్పిన ఏపీ(Andharpradesh) ప్రగతి చక్రాలని మళ్లీ గాడిలో పెట్టి.. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది.. తెలుగు జాతి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాలకు ఎన్టీఆర్ దిశా నిర్దేశం చేశారన్నారు. నందమూరి అభిమానులుగా ఎన్టీఆర్ ఆశయసిద్ధికి నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యలను గుర్తు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు స్ఫూర్తిగా తీసుకుని అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు రాణించే రోజులు వస్తున్నాయన్నారు.
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సుమారు 2 వందల మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. దేవినేని ఉమ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని.. నీటి పారుదలశాఖా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి విశేష కృషి చేశారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, హరీష్ కోయా, శ్రీధర్ అప్పసాని, సునీల్ కోగంటి, హరి బుంగతావుల, హరి మోటుపల్లి, వంశి వాసిరెడ్డి, సుధాకర్ తురగా, సతీష్ తుమ్మల, గోపి వాగ్వాల, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, మోహన్ మల్ల ప్రసాద్ క్రొత్తపల్లి, రంజిత్ మామిడి, సురేష్ యలమంచి, సాంబయ్య కోటపాటి, రవి చిక్కాల తదితరులు పాల్గొన్నారు.
