NRI: దుబాయిలో ఘనంగా ఆంధ్ర ట్రినిటీ చర్చ్ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-10-22T18:53:34+05:30 IST

దుబాయిలోని తెలుగు క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తున్న ఆంధ్ర ట్రినిటీ చర్చి వార్షికోత్సవం ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది.

NRI: దుబాయిలో ఘనంగా ఆంధ్ర ట్రినిటీ చర్చ్ వార్షికోత్సవం
దుబాయిలో ఘనంగా ఆంధ్ర ట్రినిటీ చర్చ్ వార్షికోత్సవం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలోని(Dubai) తెలుగు క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ గత పదిహేను సంవత్సరాలుగా భక్తుల నీరాజనాలు అందుకొంటున్న ఆంధ్ర ట్రినిటీ చర్చి(Andhra Trinity Church) వార్షికోత్సవం ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది. పాస్టర్ గొల్ల ఎలిశా ఆధ్వర్యంలో సుడానీ క్లబ్ ఆవరణలో పూర్తిగా తెలుగు వాతావరణంలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో(Anniversary) ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతి ఆచార వ్యవహారాలున్న ఒక ఎడారి దేశంలో ఉపాధి కోసం వచ్చి వేలాది మంది క్రైస్తవులకు దైవచింతన సేవలందించడాన్ని ప్రశంసించారు. విభిన్న మతాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ భిన్నత్వంలో ఏకత్వమే తెలుగుతనం గొప్పదనమని ఆయన వ్యాఖ్యానించారు.


కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ దుబాయిలోని తెలుగు ప్రవాసీయుల(NRI) మంచిచెడులను పట్టించుకోవడంలో చర్చి సంఘం సభ్యులు ముందుండడం అభిందనీయమని అన్నారు. కరోనా సంక్షోభంలో చర్చి సభ్యులు దుబాయిలోని తెలుగు దేశం పార్టీ అభిమానులతో కలిసి చేపట్టిన సహాయక చర్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ట్రినిటీ చర్చి చేపట్టే ప్రతి సంక్షేమ, సహాయక చర్యలకు దుబాయిలోని తెలుగుదేశం పార్టీ(TDP) అభిమానులు అండగా నిలుస్తారని రాధాకృష్ణ పేర్కొన్నారు. ట్రినిటీ చర్చి సభ్యులు ప్రతి నెలా కోనసీమలో అభాగ్యులకు ఆపన్నహస్తం అందించడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా యు.ఏ.ఇ తెలుగుదేశం పార్టీ రూపొందించిన 2023 క్యాలెండర్‌ను సూర్యరావు, రాధాకృష్ణా, ఎలిశా విడుదల చేశారు. కార్యక్రమంలో పాస్టర్ ఎలీషాతో పాటూ బ్రదర్ క్రాంతి కుమార్. యూఏఈ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

4.jpg

2.jpg

1.jpg

Updated Date - 2022-10-22T19:22:23+05:30 IST