భారత అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. వీళ్ల లవ్ స్టోరీ భలే..

ABN , First Publish Date - 2022-09-26T05:08:41+05:30 IST

సోషల్ మీడియాలో కలుసుకున్న ఓ జంట చివరికి వివాహ బంధంలో ఒక్కటయ్యింది. కేవలం ఆరు నెలల్లోనే వారి ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇలాంటివి మీరు ఎన్నో చూసుండొచ్చు కానీ.. మన చెప్పుకోబోయే లవ్ స్టోరీలో అబ్బాయి భారతీయుడైతే అమ్మాయి ఏకంగా అమెరికా.

భారత అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. వీళ్ల లవ్ స్టోరీ భలే..

ఎన్నారై డెస్క్: సోషల్ మీడియాలో కలుసుకున్న ఓ జంట చివరికి వివాహ బంధంలో ఒక్కటయ్యింది. కేవలం ఆరు నెలల్లోనే వారి ప్రేమ పెళ్లికి దారితీసింది. ఇలాంటివి మీరు ఎన్నో చూసుండొచ్చు కానీ.. మన చెప్పుకోబోయే లవ్ స్టోరీలో అబ్బాయి భారతీయుడైతే అమ్మాయి ఏకంగా అమెరికా. అబ్బాయి ఉండేది హరియాణాలో(Haryana).. పేరు నిఖిల్ కన్వాల్! అతడు రెజ్లర్. ఇక స్టెఫానీది.. కాలిఫోర్నియా(California) రాష్ట్రంలోని ఫొంటానా. గతేడాది ఓ సందర్భంలో నిఖిల్ తన ఫొటోలు ఇన్‌స్టాలో పెట్టగా.. దాన్ని చూసిన స్టెఫానీ లైక్ కొట్టింది. అదిగో అలా వారు ఒకరికొకరు పరిచయమయ్యారు. మొదట్లో మాటలన్నీ ఇన్‌స్టా వేదికగానే జరిగేవి. క్రమంగా ఒకరికొకరు వీడియో కాల్స్ చేసుకోవడం కూడా ప్రారంభించారు. 


అలా అలా వారి మధ్య ప్రేమ పుట్టింది. ఓ రోజు వారు వీడియో కాల్‌లో  ఉండగా నిఖిల్ తల్లి చూసింది. దీంతో.. నిఖిల్ అసలు విషయం చెప్పేశాడు. ఆమెనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఇంట్లో వాళ్లు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఇక గతేడాది జూన్‌లో ఆమె ఇండియాకు వచ్చింది. అయితే.. ఆమె వస్తోందన్న వార్త వినగానే సంబరపడిపోయిన నిఖిల్ ఇంట్లో వాళ్లందరికీ.. ఈ ఇంటికి కాబోయే కోడలు వస్తోందని సంబరంగా చెప్పేశాడు. ఇక ఆ తరువాత కొద్ది నెలలకు అంటే.. డిసెంబర్‌లో వారి వివాహం అయ్యింది. హరియాణాలో ఆ దంపతులు పెళ్లి చేసుకున్నారు. 


అన్నట్టు వారిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. అమెరికాలో స్టెఫానీ  ఇంటికి సంబంధించిన వీడియో, తమ లైఫ్‌లో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నిరజ్ చోప్రో ఇంట జరిగిన ఓ వివాహానికి కూడా వారు హాజరయ్యారు. అతడితో కలిసి ఫొటోలు దిగారు. ఇవన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Read more