USA: అమెరికాలో దారుణం.. మూడేళ్ల చిన్నారి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండగా వెనక నుంచి..

ABN , First Publish Date - 2022-12-31T20:35:58+05:30 IST

అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డ మూడేళ్ల బాలికను ఓ మహిళ వెనుక నుంచి అకస్మాత్తుగా తోయడంతో చిన్నారి పట్టాలపై పడిపోయింది.

USA: అమెరికాలో దారుణం.. మూడేళ్ల చిన్నారి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండగా వెనక నుంచి..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని(USA) ఓరాగాన్(Oregon) రాష్ట్రంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డ మూడేళ్ల బాలికను ఓ మహిళ(US Woman) వెనుక నుంచి అకస్మాత్తుగా తోయడంతో చిన్నారి పట్టాలపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. బుధవారం నార్త్‌ఈస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని(North East Portland) గేట్‌వే ట్రాన్సిట్ సెంటర్ మ్యాక్స్ ప్లాట్‌ఫామ్ వద్ద ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితురాలిని బ్రియానా వర్క్‌‌మన్‌గా(Brianna Workman) పోలీసులు గుర్తించారు. గురువారం ఆమెను అరెస్టు చేశారు. ప్రజారవాణా వ్యవస్థకు అంతరాయం, ఇతరులకు ప్రాణాపాయం కలిగించడం తదితర సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెకు బెయిల్‌ కూడా మంజూరు కాదని స్థానిక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బ్రియానా నిష్కారణంగా బాలికను పట్టాలపైకి తోసేసిందని డిస్ట్రిక్ట్ అటార్నీ ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారి తలకు స్వల్ప గాయం అయిందన్నారు. అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు చిన్నారిని కాపాడారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలకు చిక్కాయి.

Updated Date - 2022-12-31T20:36:00+05:30 IST