అమెరికాలో మహిళపై పిడుగు.. చేతి గడియారం పేలిపోయి.. బూట్లలో రంధ్రాలు ఏర్పడి..

ABN , First Publish Date - 2022-08-27T05:19:47+05:30 IST

పిడుగు పడటంతో మరణం అంచులకు వరకూ వెళ్లిన ఓ అమెరికా విద్యార్థిని అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.

అమెరికాలో మహిళపై పిడుగు.. చేతి గడియారం పేలిపోయి.. బూట్లలో రంధ్రాలు ఏర్పడి..

ఎన్నారై డెస్క్: పిడుగు పడటంతో మరణం అంచులకు వరకూ వెళ్లిన ఓ అమెరికా విద్యార్థిని అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. యువతికి చికిత్స చేసిన వైద్యలు ఆమె చాలా లక్కీ అంటూ వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఫ్లోరిడాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 18 ఏళ్ల ఎమ్మా ఎగ్లర్ ఆగస్టు 22ను తన క్లాసు వైపు వెళుతోంది. కాలేజీలో ఆమెకు అదే తొలిరోజు. అప్పడు అక్కడ బాగా వర్షం పడుతోంది. 


అయితే.. క్లాసు రూం వైపు వెళుతున్న ఆమెపై పిడుగు పడింది. దీంతో.. ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. తన కాళ్లను ఆసలేమాత్రం కదపలేకపోయింది. కాలికి ఉన్న బూట్లకు చిల్లులుపడ్డాయి. షర్ట్ బటన్లు వాటంతట అవే ఊడిపోయాయి. చేతి ఉన్న వాచ్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే.. తల్లికి కాల్ చేసేందుకు బ్యాగులో ఉన్న ఫోన్ వెలికి తీసి చూస్తే అది కూడా కాలిపోయి కనిపించింది. అయితే..అటువైపు వెళుతున్న వారు వెంటనే ఆమెను ఓ బెంచ్‌పై పడుకోబెట్టి.. అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారి సాయంతో పెన్సకోలా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అదృష్టం బాగుండి తాను ప్రాణాలతో బయటపడ్డట్ట పలువురు వైద్యులు తనతో చెప్పినట్టు ఆమె పేర్కింది. మరో వారంలో మళ్లీ యూనివర్శిటీ వెళతానని చెప్పింది.  

Updated Date - 2022-08-27T05:19:47+05:30 IST