భారీ కొండ చిలువను గుర్తించిన పరిశోధకులు.. అంత పెద్దదాన్ని ఆ రాష్ట్రంలో చూడటం ఇదే తొలిసారట!

ABN , First Publish Date - 2022-06-24T15:15:50+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారీ కొండ చిలువను పరిశోధకులు గుర్తించారు. ఫ్లోరిడాలోని కొంత మంది బయాలజిస్ట్‌ల బృందానికి బర్మీస్ జాతికి చెందిన ఆడ కొండ చిలువ మృతదేహం కంటపడింది. దీంతో దాన్ని పరిశోధనా కేంద్రానికి తరలించారు. అనంతరం దానికి పోస్ట్‌

భారీ కొండ చిలువను గుర్తించిన పరిశోధకులు.. అంత పెద్దదాన్ని ఆ రాష్ట్రంలో చూడటం ఇదే తొలిసారట!

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారీ కొండ చిలువను పరిశోధకులు గుర్తించారు. ఫ్లోరిడాలోని కొంత మంది బయాలజిస్ట్‌ల బృందానికి బర్మీస్ జాతికి చెందిన ఆడ కొండ చిలువ మృతదేహం కంటపడింది. దీంతో దాన్ని పరిశోధనా కేంద్రానికి తరలించారు. అనంతరం దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో ఆ భారీ సర్పం పొట్టలో సుమారు 122 గుడ్లను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. 18ఫీట్ల పొడవు.. సుమారు 98 కేజీల బరువు గల భారీ ఫైథాన్‌ను ఫ్లోరిడా రాష్ట్రంలో చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. అంతేకాకుండా.. దాని పొట్టలో జింకకు సంబంధించిన కొన్ని అవశేషాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పైథాన్ చనిపోవడానికి ముందు.. చివరిసారిగా ఓ జింకను తిని ఉండొచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ కొండ చిలువ బయటి రాష్ట్రాల్లోంచి ఫ్లోరిడాలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 


Updated Date - 2022-06-24T15:15:50+05:30 IST