బాలికను జుట్టుపట్టి లాగిన టీచర్‌కు దిమ్మతిరిగే షాక్..!
ABN , First Publish Date - 2022-02-07T22:58:16+05:30 IST
విద్యార్థినిని జుట్టుపట్టి లాగిన ఓ ఉపాధ్యాయురాలికి ఊహించని షాక్ తగిలింది. విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు టీచర్‌ను అరెస్టు చేశారు. అమెరికాలోని కనెక్టీకట్ రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థినిని జుట్టుపట్టి లాగిన ఓ ఉపాధ్యాయురాలికి ఊహించని షాక్ తగిలింది. విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు టీచర్‌ను అరెస్టు చేశారు. అమెరికాలోని కనెక్టీకట్ రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. కింగ్/రాబిన్సన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్‌లో ఫిబ్రవరి 1న జెన్నీఫర్ వెల్స్-జాక్సన్ అనే టీచర్ ఓ పన్నెండేళ్ల విద్యార్థినిని జుట్టుపట్టి వెనక్కు లాగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన జుట్టువదలమంటూ బాలిక పెద్దపెట్టున అరిచిన దృశ్యం కూడా ఈ వీడియోలో రికార్డైంది. విషయం విద్యార్థిని తల్లి దృష్టికి వెళ్లడంతో ఆమె జెన్నిఫర్‌పై మండిపడింది. ‘‘ఓ విద్యార్థినితో ఇలా వ్యవహరించడం ఏ విధంగానూ సమర్ధించడం కుదరుదు’’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా.. అరెస్టయిన టీచర్‌ను పోలీసులు 20 వేల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. మరోవైపు.. అనేక ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న జెన్నిఫర్ వివాదరహితురాలని సహోద్యోగులు తెలిపారు. ఆనేక సమాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నట్టు తెలిపారు. కాగా.. ఇందుకు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.