బ్రిటన్ రాణికి నివాళులు అర్పించిన అమెరికా అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-09-19T04:50:54+05:30 IST

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు(Queen Elizabeth-2 funeral) హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) ఆయన సతీమణి.. వెస్ట్‌మిన్స్‌టర్ హాలులో(West minster) రాణి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

బ్రిటన్ రాణికి నివాళులు అర్పించిన అమెరికా అధ్యక్షుడు

ఎన్నారై డెస్క్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు(Queen Elizabeth-2 funeral) హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden), ఆయన సతీమణి.. వెస్ట్‌మిన్స్‌టర్ హాలులో(West minster) రాణి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పార్థివదేహాన్ని పార్లమెంట్‌ ఎస్టేట్‌లోని వెస్ట్‌మిన్సస్టర్ హాలులో ఉంచిన విషయం తెలిసిందే. దీన్ని లైయింట్-ఇన్-స్టేట్(Lying-in-state) అని అంటారు. ప్రస్తుతం వేల సంఖ్యలో బ్రిటన్ ప్రజలు రాణికి నివాళులు అర్పిస్తున్నారు. రాణి కడసారి చూపు కోసం గంటల కొద్దీ క్యూలో నిలబడేందుకు కూడా వెనకాడట్లేదు. 


ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజు ఛార్ల్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసెప్షన్‌కు కూడా అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి హాజరువుతారు. కాగా.. మొత్తం 500 మంది ప్రముఖులు సెప్టెంబర్ 19న జరగనున్న రాణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. వీరిలో వివిధ దేశాధినేతలతో పాటూ రాజవంశీయులు కూడా ఉన్నారు. ఇక రాజు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో ప్రిన్స్ విలియమ్‌తో పాటూ ఆయన సతీమణి కేట్ కూడా పాల్గొంటారు. రాజు ఛార్ల్స్ తరువాత బ్రిటన్ సింహాసనాన్ని ప్రిన్స్ విలియమ్స్ అధిరోహిస్తారన్న విషయం తెలిసిందే.  

Updated Date - 2022-09-19T04:50:54+05:30 IST