USA: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే ఈ జంటపై విపరీతంగా ట్రోలింగ్.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-10-27T23:48:36+05:30 IST

అమెరికా జంటపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్. వారి మధ్య ఉన్న వయసు వ్యత్యాసమే దీనికి కారణం.

USA: సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే ఈ జంటపై విపరీతంగా ట్రోలింగ్.. కారణం ఏంటో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: ఆమె వయసు జస్ట్ 22. ఆయన ఆమె కంటే ఏకంగా 33 ఏళ్లు పెద్ద. మొదటిసారి వారిని చూసిన వారెవరైనా తండ్రీకూతుళ్లు అని అనుకుంటారు. అసలు విషయం తెలిసి అవాక్కైపోతారు. కారణం.. వారిద్దరూ భార్యాభర్తలు కావడమే. ఆ యువతి పేరు నికోల్. ఆమె భర్త పేరు మైఖేల్(Michael). వారుండేది అమెరికాలోని మిషిగన్(Michigan) రాష్ట్రంలో! నాలుగేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం డేటింగ్ చేశాక వివాహబంధంలో ఒక్కటయ్యారు. ఇటీవల కాలంలో కొన్ని జంటలు తమ జీవిత విశేషాలను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. నికోల్-మైఖేల్ దంపతులదీ ఇదే తరహా! ఇద్దరూ తరచూ సోషల్ మీడియాలో వీడియోల పెడుతుంటారు. అదే వారిపై ట్రోలింగ్‌కు(Trolling) కారణమవుతోంది. వారి మధ్య వయసు వ్యత్యాసాన్ని(Age gap) పదే పదే ఎత్తి చూపుతూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు.

కానీ.. ఈ జంట(Couple) వీటిని అసలేమాత్రం లెక్కచేయదు. ఆ కామెంట్స్ తమను ఇబ్బంది పెట్టవని నికోల్(Nicole) ఒక్కమాటలో తేల్చేస్తుంది. మైఖేల్.. నీ తండ్రా అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తుంటారు.. డబ్బు కోసమే వృద్ధుడిని పెళ్లి చేసుకున్నావని మరికొందరు నోరు పారేసుకుంటారు. కానీ నికోల్ మాత్రం ఈ ట్రోలింగ్‌ను లెక్కేచేయదు. తాము వివాహబంధంలో ఎంతో సంతోషంగా ఉన్నామని ఆమె చెబుతుంది. అంతేకాదు.. మైఖేల్ తనకు అదృష్టం కొద్దీ దక్కాడని అంటుంది. మరో విషయం ఏంటంటే..ఈ విమర్శలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాదు. అయితే.. నికోల్‌కు మద్దతుగా నిలిచేవారూ కోకొల్లలుగా ఉన్నారు. ‘‘వారిద్దరూ వైవాహిక బంధాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్లమానన వాళ్లను వదిలేయండి’’ అని నికోల్ ఫాలోవర్స్ చెబుతుంటారు. ఇక నికోల్ తరచూ టిక్‌టాక్‌లో వీడియోలను షేర్ చేస్తుంటుంది. నికోల్‌కు ఏకంగా 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2022-10-27T23:48:41+05:30 IST