చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి.. ఇంతలో పెద్ద అరుపు.. శబ్దం వచ్చినవైపు తలతిప్పి చూస్తే..!

ABN , First Publish Date - 2022-08-06T04:40:15+05:30 IST

ఓ మొసలి(Alligator) మనిషి ముఖాన్ని కొరికిన(bite) ఉదంతం తాజాగా ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది.

చెరువులో ఈతకు వెళ్లిన వ్యక్తి.. ఇంతలో పెద్ద అరుపు.. శబ్దం వచ్చినవైపు తలతిప్పి చూస్తే..!

ఎన్నారై డెస్క్: ఓ మొసలి(Alligator) మనిషి ముఖాన్ని కొరికిన(bite) ఉదంతం తాజాగా ఫ్లోరిడా(Florida) రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది. ఇది చాలా అరుదైన ఘటన అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టాంపాకు ఈశాన్యాన ఉన్న తొనోటోసాస్సా సరస్సులో బాధితుడు ఈతకు వెళ్లిన సందర్భంలో మొసలి అతడి ముఖాన్ని కొరికినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘‘నేను సరస్సు వడ్డున కూర్చుని ఉన్నా. అకస్మాత్తుగా ఏదో శబ్దం వినిపించింది. తలెత్తి చూస్తే.. ఓ వ్యక్తి నీటిలోంచి బయటకు వస్తూ కనిపించాడు. అతడి మొఖంపై పెద్ద గాయమైంది. ఏదైనా రాయిని ఢీకొట్టాడోమే అనుకున్నా’’ అని ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాకు తెలిపారు. 


ఆ తరువాత గాయాన్ని నిశితంగా పరిశీలించి చూడగా అది మోసలి కొరకడంతో ఏర్పడినదని తేలింది. ‘‘నా వద్ద ఉన్న మెడికల్ కిట్‌తో బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించా. రక్తం కారకుండా కట్టు కట్టా. ఈలోపు అంబులెన్స్ వచ్చింది. అతడిని సమీప ఆస్పత్రికి తరలించాం’’ అని ఆ సాక్షి తెలిపారు. మొసళ్లు సాధారణంగా మనుషులపై దాడి చేయవని నిపుణులు చెబుతున్నారు. తమకు ప్రమాదం రాబోతోందని అనుమానించినప్పుడే అవి దాడికి తెగబడతాయని తెలిపారు. కాగా.. ఫ్లోరిడా రాష్ట్రంలో సుమారు 1.3 మిలియన్ల ఆలిగేటర్ మోసళ్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక బాధితుడి ముఖం కొరికిన మొసలి పట్టుకునేందుకు అధికారులు వేటగాళ్ల సాయం తీసుకుంటున్నారు. ఆ మోసలి మరో దాడి చేయకముందే దాన్ని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-06T04:40:15+05:30 IST