రూ15.66కోట్లు గెలుచుకున్న American.. ఆ క్రెడిట్ మొత్తం తన కుక్కకే ఇచ్చేశాడు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-06-22T23:44:52+05:30 IST

అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా రూ.15.66కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన అతడు.. ఈ క్రెడిట్ మొత్తాన్ని తన కుక్కకే ఇచ్చేశాడు. అదే లేకుంటే తాను అంత మొత్తాన్ని గెలుచుకునే వాడిని కాదంటున్నా

రూ15.66కోట్లు గెలుచుకున్న American.. ఆ క్రెడిట్ మొత్తం తన కుక్కకే ఇచ్చేశాడు.. ఎందుకంటే..

ఎన్నారై డెస్క్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా రూ.15.66కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన అతడు.. ఈ క్రెడిట్ మొత్తాన్ని తన కుక్కకే ఇచ్చేశాడు. అదే లేకుంటే తాను అంత మొత్తాన్ని గెలుచుకునే వాడిని కాదంటున్నాడు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బులోంచి కొంత మొత్తాన్ని వెచ్చించి.. తన పెంపుడు కుక్కకు ఇల్లు కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించాడు. కాగా.. ఇంతకూ అతడు డబ్బును ఎలా గెలుచుకున్నాడు? అతడు డబ్బు గెలుచుకోవడానికి కుక్కను మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


Americaలోని ఫ్లోరిడాకు చెందిన లియోనార్డ్ లింటన్‌(42)కు శునకాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే డాచ్‌షండ్ (dachshund) జాతికి చెందిన ఓ కుక్కను తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటున్నాడు. అతడు ఐవీ(Ivy) అని పిలుచుకునే ఆ శునకం గర్భందాల్చింది. కాగా.. తాజాగా ఓ పని మీద బయటకు వెళ్లిన అతడికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఐవీ అనారోగ్యానికి గురైనట్లు ఫోన్‌లో సమాచారం రావడంతో.. అతడు కంగారుపడ్డాడు. వెంటనే ఇంటికి బయల్దేరాడు. ఇంటికి త్వరగా వెళ్లేందుకుగాను ఎప్పటికీ వెళ్లే రూట్‌లో కాకుండా కొత్త రూట్‌లో అతడు ప్రయాణం చేశాడు. ఈ సందర్భంగా ఓ లాటరీ షాపు వద్ద కొద్దిసేపు కారు ఆపిన అతడు.. సరదాగా లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడికి అదృష్టం వరించింది. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌‌.. లక్కీ డ్రాలో 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15.66కోట్లు) తెచ్చిపెట్టింది. దీంతో అతడు ఎగిరి గత్తేసిన లింటన్.. ఐవీకి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రాకపోతే తాను అటు వెళ్లే వాడిని కాదని.. అదే జరిగితే తనకు డబ్బులు వచ్చి ఉండేవి కాదని పేర్కొన్నాడు. ఐవీ వల్లే తాను కోటీశ్వరుడిని అయినట్లు ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తాను గెలుచుకున్న డబ్బుతో.. ఐవీకి కొత్త పప్పీ హౌస్‌ను కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. చట్టప్రకారం ట్యాక్సులన్నీ పోనూ లింటన్‌కు 1,645,000 డాలర్లు చేతికి అందుతాయని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు. 


Updated Date - 2022-06-22T23:44:52+05:30 IST