విదేశీ అల్లుళ్లు.. భారతీయ ముద్దుగుమ్మలు.. దేశాలు దాటి మరీ జీవిత భాగస్వాములను ఎంచుకున్న వారి లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-09-21T23:00:15+05:30 IST

ప్రేమ.. దీన్ని మాటల్లో వర్ణించలేం. కేవలం చేతల్లో మాత్రమే చూపగలం. ఇటువంటి ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి మీద పుడుతుందో కూడా చెప్పలేం. లవ్‌కు సంబంధించిన ఈ మాటలు ఆరుగురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల విషయంలో నిజమయ్యాయి. ఎక్కడ చూశారో.. ఎప్పుడు చూశారో తెలీదు కానీ మన దేశానికి చెందిన అమ్మాయిలపై మనసు పాడేసుకున్నారు.

విదేశీ అల్లుళ్లు.. భారతీయ ముద్దుగుమ్మలు.. దేశాలు దాటి మరీ జీవిత భాగస్వాములను ఎంచుకున్న వారి లిస్ట్ ఇదీ..!

ఎన్నారై డెస్క్: ప్రేమ.. దీన్ని మాటల్లో వర్ణించలేం. కేవలం చేతల్లో మాత్రమే చూపగలం. ఇటువంటి ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి మీద పుడుతుందో కూడా చెప్పలేం. లవ్‌కు సంబంధించిన ఈ మాటలు ఆరుగురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల విషయంలో నిజమయ్యాయి. ఎక్కడ చూశారో.. ఎప్పుడు చూశారో తెలీదు కానీ మన దేశానికి చెందిన అమ్మాయిలపై మనసు పాడేసుకున్నారు. అంతేకాదు తమ ప్రేమను వ్యక్తం చేసి.. తిరిగి వాళ్ల ప్రేమను కూడా గెలుచుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటై.. హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. ఏకంగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీల దృష్టినే ఆకర్షించిన ఆ ముద్దు గుమ్మలు ఎవరు? మన దేశ యువతులను పెళ్లాడిన ఆ సెలబ్రిటీలు ఎవరు అనే వివరాలపై ఓలుక్కేస్తే..1. గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్ (Glenn Maxwell & Vini Raman)

గ్లెన్ మాక్స్‌వెల్.. ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ క్రికెటర్. ఇతడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రికెటర్.. ఎప్పుడు.. ఎక్కడ చూశాడో కానీ భారత్‌కు చెందిన వినీ రామన్‌(తమిళనాడుకు చెందిన యువతి)‌పై మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించడంతో చాలా కాలంపాటు డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం నిశ్చితార్థం చేసుకుని.. ఫైనల్‌గా ఈ ఏడాది మార్చిలో పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటై మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.2. నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా ( Nick Jonas & Priyanka Chopra)

నిక్ జోనాస్.. మల్టిపుల్ ట్యాలెంటెడ్ పర్సన్. పాటలు పాడటంతోపాటు వాటిని రాయగలడు కూడా. అంతేకాదు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించగలడు. అమెరికాకు చెందిన నిక్ జోనాస్.. తన కంటే పదేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రా‌ను ఇష్టపడ్డాడు. 2017లో న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరూ.. ఒకరికొకరు నచ్చడంతో దాదాపు ఏడాదిపాటు డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం 2018లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. 3. షాన్ టెయిట్, మషూమ్ సింఘా (Shaun Tait & Mashoom Singha)

షాన్ టెయిట్.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్. ఇతడు భారత్‌కు చెందిన మోడల్ మషూమ్ సింఘాను ఇష్టపడ్డాడు. మషూమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ నాలుగేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. చివరకు 2014లో కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. 


4. జీన్ గూడెనఫ్, ప్రీతి జింటా (Preity Zinta & Gene Goodenough)

బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా.. యూఎస్‌కు చెందిన హైడ్రోఎలక్ట్రిసిటీ పవర్ కంపెనీలో సీనియర్ వీపీగా ఉన్న జీన్ గూడెనఫ్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులు సరోగసి విధానంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రీతి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తోంది.5. బెనెడిక్ట్ టేలర్, రాధికా ఆప్టే (Radhika Apte & Benedict Taylor)

బెనెడిక్ట్ టేలర్.. లండన్‌కు చెందిన సంగీతకారుడు. ఇతడిని రాధిక ఆప్టే 2012లో వివాహం చేసుకుంది. కొన్ని సెలబ్రిటీ జంటలు.. పెళ్లైన మూడునాళ్లకే విడాకులతో వేరవుతుండటం ఇప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ జంట మాత్రం.. వర్క్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. 6. పీటర్ హాగ్, సెలీనా జైట్లీ (Celina Jaitly & Peter Haag)

సెలీనా జైట్లీ.. ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆమె నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ను వదిలిపెట్టిన ఈ బ్యూటీ.. 2012లో ఆస్ట్రేలియాకు చెందిన హోటల్ వ్యాపారీ పీటర్ హాగ్‌ను వివాహమాడింది. దుబాయ్‌లో తొలిసారిగా కలుసుకున్న ఈ ఇద్దరూ.. తర్వాత కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. 


Updated Date - 2022-09-21T23:00:15+05:30 IST