బహ్రెయిన్‌లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-01T16:57:21+05:30 IST

బహ్రెయిన్‌లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. భర్తతో కలిసి ఓ అపార్టు‌మెంటులో నివసిస్తున్న ఆమె.. తొమ్మిదవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక అ

బహ్రెయిన్‌లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య

ఇంటర్నెట్ డెస్క్: బహ్రెయిన్‌లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. భర్తతో కలిసి ఓ అపార్టు‌మెంటులో నివసిస్తున్న ఆమె.. తొమ్మిదవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం భర్తతో జరిగిన గొడవేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.


ఇదిలా ఉంటే.. 2014 నుంచి దాదాపు 180 మంది ప్రవాసులు బహ్రెయిన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారని కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ పేర్కొన్నారు. యూఏఈలో 600, కువైత్‌లో 545, సౌదీ అరేబియాలో 300, ఒమన్‌లో 123 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 
Updated Date - 2022-05-01T16:57:21+05:30 IST