తానా బోర్డు డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాస్ ఇంట విషాదం..

ABN , First Publish Date - 2022-09-27T01:45:19+05:30 IST

తానా(TANA) బోర్డు డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

తానా బోర్డు డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాస్ ఇంట విషాదం..

ఎన్నారై డెస్క్: తానా(TANA) బోర్డు డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం వాలర్ కౌంటీలో(టెక్సాస్) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డా. శ్రీనివాస్ సతీమణి వాణి , వారి ఇద్దరు కుమార్తెలు అసువులుబాశారు. తమ పెద్ద కూతురిని వాణి కాలేజీ నుంచి కారులో ఇంటికి తీసుకొస్తుండగా.. పక్క నుంచి వచ్చిన మరో వాహనం వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తానా సభ్యులు, శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో భగవంతుడు శ్రీనివాస్‌కు మానసిక స్థైర్యం ఇవ్వాలని అభిలషించారు. 

Read more