Kuwait: 3నెలల్లో ఏకంగా 27వేల మంది వలసదారులు ఔట్.. భారత్‌ను దాటేసిన ఈజిప్ట్
ABN , First Publish Date - 2022-04-07T14:00:58+05:30 IST
గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ నుంచి భారీ సంఖ్యలో ప్రవాసులు తరలిపోతున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీతో పాటు ఇతర కఠిన నిబంధనల కారణంగా భారీ మొత్తంలో వలసదారులు కువైత్‌ను విడిచి పెడుతున్నారు. తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 3నెలల్లో..

కువైత్ సిటీ: గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ నుంచి భారీ సంఖ్యలో ప్రవాసులు తరలిపోతున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీతో పాటు ఇతర కఠిన నిబంధనల కారణంగా భారీ మొత్తంలో వలసదారులు కువైత్‌ను విడిచి పెడుతున్నారు. తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన మూడు నెలల్లో ఏకంగా 27,200 మంది వలసదారులు కువైత్‌ను వదిలివెళ్లారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి ఆ దేశ లేబర్ మార్కెట్లో విదేశీ కార్మికుల సంఖ్య 14,79,545గా ఉంటే.. ఇప్పుడది 14,52,344కు చేరింది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం కువైత్‌లో ఉన్న విదేశీ కార్మికుల జాబితాలో ఈజిప్ట్ టాప్‌లో ఉంది. ఆ దేశానికి చెందిన 4,51,000 మంది వర్కర్లు కువైత్‌లో పని చేస్తున్నారు. ఈజిప్ట్ తర్వాత 4,37,000 మంది కార్మికులతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్(1,58,700), పాకిస్థాన్(69,500), ఫిలిప్పీన్స్(64,300), సిరియా(63,300), నేపాల్(38,000), జోర్డాన్(25,500), ఇరాన్(20,000) ఉన్నాయి.