Hate Crime: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం.. భారత మహిళలే లక్ష్యంగా యూఎస్ వ్యక్తి వరుస దాడులు

ABN , First Publish Date - 2022-10-07T13:37:47+05:30 IST

అమెరికాలో 14 మంది భారత మహిళలపై దాడి చేసిన వ్యక్తిని కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు.

Hate Crime: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం.. భారత మహిళలే లక్ష్యంగా యూఎస్ వ్యక్తి వరుస దాడులు

అమెరికాలో హిందూ-విద్వేష దాడులు

14మంది భారత మహిళలపై దాడి, ఆభరణాల చోరీ

కాలిఫోర్నియా, అక్టోబరు 6: అమెరికాలో 14 మంది భారత మహిళలపై దాడి చేసిన వ్యక్తిని కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్‌ నుంచి అతడు ఈ దాడులకు పాల్పడుతున్నాడని వారు పేర్కొన్నారు. ఈస్ట్‌ పాలో ఆల్టోలో నివసిస్తున్న 37 ఏళ్ల లాథన్‌ జాన్సన్‌ను నిందితుడిగా గుర్తించిన అధికారులు, అతడిపై పలు కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. భారత సంప్రదాయ కట్టు, బొట్టు కలిగిన మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆభరణాలను చోరీ చేస్తున్నాడు. 

Read more