New York Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి!
ABN , First Publish Date - 2022-05-15T13:54:00+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్‌లోని టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 18 ఏళ్ల యువకుడు సైనికుడి వేషంలో తుపాకీతో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్‌లోని టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 18 ఏళ్ల యువకుడు సైనికుడి వేషంలో తుపాకీతో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గాయపడ్డారని సిటీ పోలీస్ అధికారి జోసెఫ్ గ్రామగ్లియా వెల్లడించారు. మృతుల్లో 8 మంది నల్లజాతీయులు, ఇద్దరు శ్వేతజాతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరగడంతో జాతి విద్వేషమే కారణమని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. కాగా, కాల్పులు జరిపిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.