after a break-up: ప్రేమ విఫలం అయితే ఇలా మాత్రం చేయకండి.

ABN , First Publish Date - 2022-08-12T20:11:44+05:30 IST

ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.

after a break-up: ప్రేమ విఫలం అయితే ఇలా మాత్రం చేయకండి.

ప్రేమ అనే మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో గడిచిన క్షణాలకు లెక్క తేలదు. ఆ సమయంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తుంది. మరి ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.. మరిప్పుడు కాలంతో పాటు ఆ అభిప్రాయమూ మారుతుంది.. ఇప్పటి ప్రేమలు చిన్న పొరపొచ్చాలు వచ్చినా బ్రేకప్ ల వరకూ వెళిపోతున్నాయి. 


జీవితాంతం ఒకటిగా కలిసి ఉండాలని బాసలు చేసుకుని ఎన్నో కలలు కన్న జంటలు ఒక్క మాటతో విడిపోయేంత వరుకూ పోతున్నాయి. మరి ప్రేమ విఫలం అయ్యాకా మనసు కుదుట పడేందుకు ఏం చేయాలి.. ఇన్ని బాసలు చేసుకుని బంగారు జీవితాన్ని కలలు కన్నాకా అది జరిగే సంగతి కాదని తేలిపోతే.. ప్రేమ విఫలమైనపుడు ఆ ప్రేమికుల మనో స్థితి ఎలా ఉంటుంది. ఓసారి అటుగా ఆలోచిస్తే.. అవేంటో కాస్త చూద్దాం. 


ప్రేమలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్న ఫోటోలను నెట్టింట్లో పెట్టడం, ఆ ఆనందాన్ని బహిరంగంగా ప్రదర్శించడం రొమాంటిక్ పోస్ట్ లు చేయడం చేస్తుంటారు., అదే విఫలమైతే అదే పనిని కాస్త విషాదంతో చేయడం విషాదాన్ని పోస్ట్ నిండా నింపేసి పెడుతుంటారు. ఇదే జరుగుతుంది. విడిపోయిన తరువాత ఆలోచనలకు మబ్బులు పట్టినట్టుగా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేరు. మరీ దయనీయంగా మారిపోతారు. ఎన్నో సందేహాలు, పాతకాలపు ఆలోచనలు, అప్పటి తీపి అనుభవాలు, వెరసి డిప్రెషన్ వెంటాడతాయి. 


1. బాధను పెంచుకోకండి. 

గతాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. బాధ కలిగించే క్షణాలను తిరిగి గుర్తుచేసుకోవడం అనవసరమైన కోపానికి దారితీస్తుంది. ఎంతో నిరాశను తెచ్చిపెడుతాయి. కోపంగా అనిపించినప్పుడు ఆ సమయన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కాస్త స్థిమిత పడతారు. ఏది ఏమైనా గతం గురించి ఆలోచించడం బాధనే మిగులుస్తుంది. 


2. అపరాధ భావాన్ని మోయకండి.

జీవితంలో అనుకున్నది జరగకపోవడం అనేది ప్రేమ విఫలంతోనే తెలిసిందని అనుకోండి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం వల్ల జరిగిపోయినదేదీ వెనక్కు రాదు. జరిగిన విషయాన్ని తలచుకుంటూ నిందించుకోవడం అపరాధ భావనను మోయడం భారాన్ని ఇంకా పెంచుతాయి. ఇవన్నీ చేయడానికి బదులు జరిగిన విషయాన్ని అంగీకరించడం ఇదంతా జీవితంలో భాగమని అనుకోవడం మంచిది. 


3. మీ మాజీ భాగస్వామిని నిందించకండి.

మిమ్మల్ని మీరు నిందించుకోవడం మీతో విడిపోయిన వారిని నిందించడం మానుకోకపోతే మీరింకా పాత జ్ఞాపకాలలోనే తిరుగుతున్నారని అర్థం. అవి మరింత బాధ కలిగిస్తాయి. ఇలా బ్లేమ్ చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. బదులుగా మాజీలతో మర్యాదగా వ్యవహరించడమే మంచిది. 


4. విడిపోయాకా ఇలా చేయకండి. 

కొన్నిసార్లు, సినిమాలు చూసినా, పాటలు విన్నా అవి మనల్ని గతానికి కనెక్ట్ చేస్తాయి. పుస్తకాలు, సినిమాల్లో సీన్స్ మనతో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. కాబట్టి మీ వ్యాపకాన్ని ప్రకృతి వైపుకో, మరో దాని మీదకో తిప్పుకోవడం వల్ల అవి బాధను తగ్గించే అవకాశం ఉంటుంది. 


5. అంచనా వేయడం మర్చిపోవద్దు.

విడిపోయిన తరువాత ఎవరి జీవితం అక్కడితో ఆగిపోదు.. ఇదే విషయాన్ని గురుతుపెట్టుకుని బాధనుంచి బయటపడాలి. 


6. విధ్వంసంగా మారకండి.

హార్ట్‌బ్రేక్‌లు భావోద్వేగాలు, ఒంటరితనం, నిందించుకోవడం, కోపం మొదలైన భావాలను కంట్రోల్ లో ఉంచుకోవాలి. చాలా మంది వీటిని ఎదుర్కోవడంలో విఫలమవుతారు. గాయపరుచుకోవడం, ఆత్మహత్య వైపు ఆలోచించడం ఇవన్నీ మిమ్మల్ని మీరు నష్టపడేలా చేసుకోవడమే. ప్రేమ విఫలమయితే ప్రపంచం ఆగిపోతుందనే ధోరణిని మార్చుకోవాలి. 


7. నిద్రాణస్థితిలోకి పోకండి. 

ప్రేమలో ఉన్నప్పుడు రోజులు ఏలా తెలియవో.. ఆ ప్రేమ విఫలం కాగానే కాలం ముందుకు సాగదు.. అప్పటివరకూ ఆనందాన్ని పంచిన క్షణాలు మందంగా తయారైపోతాయి. ఎక్కడి లేని బాధా మనతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. ప్రేమను కోల్పోయిన క్షణాలలోనే అమితమైన సంతోషం, ఆనందం, నవ్వు, పదిమందితో గడిపే మధురమైన అనుభూతులను పోగేసుకోవలసిన సమయం. గతాన్ని ముందేసుకుని బాధపడే సమయం కాదు. 

Read more