ఒత్తిడి వదిలించే యోగా

ABN , First Publish Date - 2022-01-25T05:30:00+05:30 IST

ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. దీన్ని తొలగించుకోకపోతే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి రుగ్మతలు తప్పవు. ...

ఒత్తిడి వదిలించే యోగా

ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. దీన్ని తొలగించుకోకపోతే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి రుగ్మతలు తప్పవు. అయితే రోజువారీ ఒత్తిడిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడానికి యోగాను ఆశ్రయించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఆసనాల ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. 


పద్మాసనం

ఈ యోగాసనం ధ్యానంతో సమానం. యోగాభ్యాసాన్ని ఈ ఆసనంతో మొదలుపెట్టి, మనసు, శరీరాలను విశ్రాంతి దశలోకి తీసుకువెళ్లాలి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

 మోకాళ్లు మడిచి, నేల మీద కూర్చోవాలి.

 ఇలా కూర్చున్నప్పుడు ఎడమ పాదం కుడి తొడ మీదకు రావాలి.

 చేతులు రెండూ మోకాళ్ల దగ్గరకు చాపి, చూపుడువేలు, బొటనవేలు తాకించాలి.

 ఈ భంగిమలో వెన్ను నిటారుగా ఉంచి, 30 సెకన్లు ఉండాలి.

 తర్వాత కుడి పాదం ఎడమ తొడ మీదకు వచ్చేలా 

కూర్చోవాలి.వృక్షాసనం

తేలికగా అనిపించే ఈ ఆసనం వేయాలంటే నేర్పు కావాలి. మీ శరీరం ఎంతవరకూ బ్యాలెన్స్‌గా ఉండగలదో పరీక్షించే ఆసనమిది. ఈ ఆసనం సాధాన చేస్తే, మనసు, శరీరాల నుంచి ఒత్తిడి తొలగిపోతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

జూ రెండు కాళ్ల మీద సమంగా బరువు మోపుతూ, రెండు చేతులు నడుము మీద ఉంచి

నిలబడాలి.

 ఎడమ కాలును నెమ్మదిగా పైకి లేపి కుడి మోకాలి మీద ఉంచుతూ శరీర బరువును కుడి కాలు మీదకు మార్చాలి.

రెండు చేతులు జోడించి, ఛాతీ దగ్గర ఉంచి, అక్కడినుంచి తల మీదగా పైకి లేపాలి.

 ఈ భంగిమలో 30 సెకన్లు ఉండి, రెండో కాలితోనూ ఇలాగే నిలబడాలి.పశ్చిమోత్తాసనం 

ఆందోళనతో తలెత్తే తలనొప్పులు, తొలగి మనసు తేలికపరిచే ఆసనమిది. వెన్ను, పిక్కల దగ్గరి కండరాలు సాగేలా చేసే ఈ ఆసనంతో శరీర అలసట తొలుగుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

 నేల మీద కాళ్లు దూరంగా చాపుకుని కూర్చోవాలి.

 ముందుకు వంగి, రెండు చేతులతో పాదాల వంపులను పట్టుకోవాలి.

 మోకాళ్లు వంచకుండా కాళ్లు నిటారుగా చాపి, తలను వంచి మోకాళ్లకు ఆనించాలి.

 పిక్కల వెనక కండరాలు లాగుతున్నట్టు అనిపిస్తే 

మోకాళ్లను స్వల్పంగా వంచవచ్చు.

 ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.

Updated Date - 2022-01-25T05:30:00+05:30 IST