World Heart Day: 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువతీయువకుల్లో కూడా హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటే..

ABN , First Publish Date - 2022-09-29T17:00:33+05:30 IST

మారుతున్న ఆధునిక కాలంలో మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ వంటి..

World Heart Day: 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువతీయువకుల్లో కూడా హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటే..

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం


మారుతున్న ఆధునిక కాలంలో మనిషి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, కొలెస్ట్రాల్‌ వంటి వాటి బారినపడుతున్నాడు. ముఖ్యంగా శరీరానికి శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌ లాంటివి తీసుకో వడంతో అధిక సంఖ్యలో యువతకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఇటీవల కాలంలో 45 సంవత్సరాలలోపు వారు ఎక్కువగా ఈ వ్యాధులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా..


జన్యుపరమైన కారణాలు

యువతీ యువకులకు గుండెజబ్బులకు జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. గుండె గదుల్లోనే కండ పెరడం వలన గుండె లయ తప్పి ప్రాణాంతకరమైన ఎరిత్మయాస్‌ దారి తీస్తుంది. దీనినే హైపర్‌ ట్రాఫిక్‌ కార్జియోమయోపతి అంటారు. దీనికి ముఖ్య కారణం జన్యుపరమైన మార్పులు. రక్తనాళాలు వాపు వచ్చి గుండెకు రక్త సరఫరా అందకపోవడం వలన హార్ట్‌ ఎటాక్‌ రావచ్చు. దీనినే కలాసికి జబ్బు అంటారు. వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం, పోస్టు కోవిడ్‌ మొదలుకుని 20 నుంచి 45 వయస్సు వారిలో గుండెజబ్బులకు గురవుతున్నారు.


తాత్సారం చేయవద్దు..

చాతి నొప్పి వచ్చినప్పుడు తాత్సారం చేయకుండా.. వెంటనే అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించి ఈసీజీ, తదితర పరీక్షలు చేయించుకోవడం మంచిది. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. అవి చివరికి మనకు కూడా సంక్రమిస్తాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా మంచిది, ఆల్కహాల్‌, సిగరెట్లు మానుకోవాలి.


గుండె జబ్బు నిర్థారణ..

ఈసీజీ వంటి తేలికైన పరీక్షల ద్వారా ప్రమాదకరమైన గుండె జబ్బులను నిర్థారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ట్రోపోలిన్‌ టెస్ట్‌, ఏకో కార్డియోగ్రామ్‌ వంటివి అవసరం అవుతాయి. వీలైనంత వరకు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి.


సత్వర చికిత్స చేయడం మేలు

గుండెపోటు వచ్చిన తరువాత ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిది. గుండెపోటు వచ్చిన మొదటి ఆరుగంటలు చాలా ముఖ్యమైనవి. ఆరు గంటల్లోనే నిలిచిపోయిన రక్తపు సరఫరా పునరుద్ధరించినట్లయితే గుండె వైఫల్యం చెందకుండా రికవరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


సరైన జీవనశైలి విధానం అలవర్చుకోవాలి

గుండెపోటు వచ్చిన తరువాత ప్రధానంగా రెండురకాలు చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. క్యాట్‌ల్యాబ్‌ ఉన్న ఆసుపత్రిలో అయితే ప్రైమరీ ఎంజోప్లాస్టిక్‌ విధానంతో యాంజి యోగ్రామ్‌ చేసి క్రిటికల్‌ బ్లాక్‌ తొలగించి రక్తసరఫరాను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిం చవచ్చు. ఇది లేకపోతే త్రోమ్‌బోలియోటిక్‌ ఇండెక్షన్‌ ద్వారా లోపల రక్తపు గడ్డలు కరిగించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎంజోప్లాస్టి లేదా బైపాస్‌ సర్జరీ అయిన తరువాత రక్తం పలుచగా చేసే మందులు జీవితాంతం వాడాలి. సరైన జీవనశైలి విధానాలను అలవర్చుకోవాలి. గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్రాణాలను కాపాడుకోండి. వీలైనంత వరకు శారీరక శ్రమ అవసరం. ప్రస్తుతం ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్‌ఫోన్లు, పడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. రానున్న రోజుల్లో గుండె వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. అప్పుడే కొంతవరకు దీని గురించి తెలుస్తుంది.

డాక్టర్‌ కొల్లూరి లక్ష్మణ్‌, కార్డియాలజిస్ట్‌, కొయ్యలగూడెం

Read more