winter : చలికాలం తంటా!

ABN , First Publish Date - 2022-11-01T23:46:32+05:30 IST

ఒక అడవిలో గినా అనే పిగ్‌ ఉండేది. దానికి సియా అనే గుడ్లగూబ మిత్రుడు. ఇద్దరూ కాలక్షేపం కోసం తిరిగేవాళ్లు. తిండిని ఇచ్చి

winter : చలికాలం తంటా!
winter

ఒక అడవిలో గినా అనే పిగ్‌ ఉండేది. దానికి సియా అనే గుడ్లగూబ మిత్రుడు. ఇద్దరూ కాలక్షేపం కోసం తిరిగేవాళ్లు. తిండిని ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అయితే గినాకి పిల్లులంటే మహాభయం. మ్యావ్‌ శబ్ధం వినపడితే చాలు గుంతలో దాక్కుంటుంది గినా. పిల్లంటే భయమెందుకో ఎవరికీ తెలీదు. గినాకి మాత్రం భయం.

రానే వచ్చింది చలికాలం. గుడ్లగూబ గూటిలోంచి బయటికి వచ్చి ‘గినా’ అంటూ కేకలు వేసింది. మెల్లగా తన గుంత లోంచి బయటకు చూసింది. ఈ చలికాలమేంటో. నాకు చిరాకు. ఈ మంచు పడటం.. ప్రాణం పోతుంది. చాలా సేపు నిద్రపోవాలనిపిస్తుంది.. అంటూ చెప్పింది గినా. ‘ఆహా.. అవునా. ఇంటిలో కూర్చుని ఉంటే ప్రపంచం తెలీదు. బయటికి వెళ్లిపోదాం.. నడువు’ అన్నది సియా. ఇద్దరూ తెల్లారుజామున నడిచి వెళ్తుంటే తెల్లవారుజామున ఎవరూ కనిపించలేదు. ఒక ఇంటి దగ్గర ఆగింది సియా. తలుపు కొట్టగానే.. తలుపు తీసింది నక్క. ఆ ఇళ్లంతా వెచ్చగా ఉంది. స్వెట్లరు, ఉన్నిటోపీలున్నాయి. గినా, సియా కూర్చుని మాట్లాడిన సమయంలో ఇద్దరికీ టీ పెట్టుకుని వచ్చింది నక్క. ఏంటి సంగతులు అంటే.. తన మిత్రుడు గినాను సియా పరిచయం చేసింది.

చలికాలం గురించి మాట్లాడుకున్నారు. ‘నాకు ఎండాకాలం. వానాకాలం కంటే చలికాలం ఇష్టం’ అంటూ నక్క చెబుతోంటే సియా చప్పట్లు కొట్టింది. నాక్కూడా అన్నది. ఇంతలోనే నాకు చలికాలమంటే చచ్చేంత భయం అన్నది గినా. ‘నాలా క్రమశిక్షణతో ఇంట్లో అన్ని సదుపాయాలు ముందే చేసి పెట్టుకుంటే.. మూడునెలలు హాయిగా ఉండొచ్చు’ అన్నది నక్క. సరేనని తలూపారు ఇద్దరూ. ‘మా స్నేహితుడు రియా పిల్లిని పిలుస్తా. పక్క ఇల్లే’ అన్నది. ‘ప్లీజ్‌ నాకు పిల్లి అంటే భయం. నేను ఇంటికి వెళ్లిపోతా’ అన్నది గినా. అంతలోనే నాకూ పని ఉంది. వెళ్దామన్నది గుడ్లగూబ. ఇద్దరూ ఇంటికి వెళ్తోంటే.. స్వెటర్‌, కాళ్లకు గ్లవుజులు, తలకు టోపీ ఇచ్చింది గినాకు. గినా సంతోషపడింది. ఆ టోపీ పెట్టుకుని, స్వెటర్‌ వేసుకుని తెల్లారుజామునే తన మిత్రుడైన సియాతో మరుసటి రోజునుంచి మాటలు కలిపింది. అలా గినాకు మెల్లమెల్లగా చలికాలమంటే భయంపోయింది. గుడ్లగూబ సంతోషపడింది. ‘ఇక.. నాకు చలితో తంటా లేదు’ అన్నది గినా.

Updated Date - 2022-11-01T23:46:34+05:30 IST