టైగర్‌ మళ్లీ గాండ్రిస్తుందా?

ABN , First Publish Date - 2022-09-25T06:55:18+05:30 IST

మాస్‌, కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. రవితేజ. ఆయన సినిమా అంటేనే మాస్‌ జాతర.

టైగర్‌ మళ్లీ గాండ్రిస్తుందా?

మాస్‌, కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. రవితేజ. ఆయన సినిమా అంటేనే మాస్‌ జాతర. అందుకే ఆయన్ని మాస్‌ మహారాజ్‌ అని పిలుచుకుంటారు. ఈ తరహా చిత్రాలు రూపొందించడంలో సిద్ధహస్తుడు అనిపించుకొన్నారు సంపత్‌ నంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందించిన ‘బెంగాల్‌ టైగర్‌’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని తెలుస్తోంది. ‘సిటీమార్‌’ తరవాత సంపత్‌ నంది ఓ స్ర్కిప్టు తయారు చేసుకొన్నారు. కొంతమంది హీరోలకూ వినిపించారు. చివరికి ఈ కథకు రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉంది. అయితే రవితేజ చేతిలో చాలా సినిమాలున్నాయి. అవన్నీ పూరయ్యే సరికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. అప్పటి వరకూ సంపత్‌నంది ఆగుతాడా? లేదంటే... మధ్యలో మిగిలిన సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి.. సంపత్‌ సినిమా మొదలెడతారా?  అనేది ఆసక్తిగా మారింది. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్‌ తీయాలని సంపత్‌నంది ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. విజయేంద్రప్రసాద్‌ కూడా సీక్వెల్‌ స్టోరీ రెడీ చేశారని తెలుస్తోంది. బహుశా.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రూపొందే కథ కూడా ఇదే కావొచ్చని టాలీవుడ్‌ టాక్‌. 

Read more