National Coffee Day 2022: కమ్మని కాఫీ డేను ఉత్సాహంగా జరుపుకుందామిలా..!

ABN , First Publish Date - 2022-09-29T14:58:56+05:30 IST

కాఫీ డే రోజున డంకిన్ డోనట్స్, మెక్ డొనాల్డ్స్, క్రిస్పీ క్రీమ్, స్టార్ బక్స్ వంటి పెద్ద కాఫీ బ్రాండ్స్ ఆఫర్స్ ప్రకటిస్తాయి.

National Coffee Day 2022: కమ్మని కాఫీ డేను ఉత్సాహంగా జరుపుకుందామిలా..!

ఉదయాన్నే వేడి వేడి పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ, ఫోన్ చూస్తూ రోజును ప్రారంభించడానికి ఇష్టపడనివారంటూ ఉండరు.. వేడి నీళ్ళల్లో కాఫీ పొడి కలిపి ఫిల్టర్ కాఫీ చేస్తే పాలు, పంచదారల కలయికతో స్వర్గాన్ని అందుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కాఫీ పొడిలో ఇన్‌స్టెంట్‌ తో కలిపిన కాఫీకి మరో రుచి వచ్చి చేరుతుంది. ఏలా తాగినా కాఫీ రుచి ప్రత్యేకమే..


ఈ జాతీయ కాఫీ డే రోజున డంకిన్ డోనట్స్, మెక్ డొనాల్డ్స్, క్రిస్పీ క్రీమ్, స్టార్ బక్స్ వంటి పెద్ద కాఫీ బ్రాండ్స్ ఆఫర్స్ ప్రకటిస్తాయి. చాలా కొద్దిమందికి మాత్రమే కాఫీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ.. కాఫీని దాదాపు ప్రపంచం మొత్తం అమితంగా ఇష్టపడుతుంది. ఇంతకీ ఈ కాఫీ పురాణం ఎందుకంటే.. ఈరోజు ప్రంపంచ కాఫీ డే.. కాఫీ ప్రియులందరికీ దాని పుట్టుపూర్యోత్తరాలు గుర్తుచేస్తూ కమ్మని కాఫీ తాగిన అనుభూతిని పొందుదాం.


కాఫీ మూలాలుకు వెళితే 9వ శతాబ్దానికి చెందిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.. అడవిలో మేకలు కాసే అతనికి ఓ చెట్టు పళ్ళు తింటున్న తన మేకలు చాలా ఉత్సహంగా ఉంటున్నాయని గమనించాడు. ఆ పళ్లకు కల్ది అనే పేరు పెట్టాడు. ఆతరువాత కాఫీ ఇథియోపియా నుంచి యోమెన్, అరేబియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభమైంది. ఆ ప్రదేశాలలో దీనిని పానీయంగా వినియోగిస్తారు. అదే సమయంలో ఈజిఫ్ట్ లోని కైరో, ఇటలీ, యూరప్ ఇతర ప్రాంతాలకు కూడా కాఫీ వాడకం వ్యాపించింది. అప్పటి నుంచి కాఫీ ప్రపంచ వ్యాప్తంగా వాడకంలోకి వచ్చింది. 


నేషనల్ కాఫీ డే 2005లో ప్రారంభమై కాఫీ ప్రియులు అందరికీ ప్రతీరోజూ అంత ఆనందాన్నిపంచే కాఫీని తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకునేలా మారింది. కాఫీలోని కెఫేన్ శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఇందులోని కెఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని తేలింది. కాఫీ తీసుకోవడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు కూడా మేలు జరుగుతుందట. అలాగే ఇందులో చెడు గుణాలు కూడా లేకపోలేదు.. కెఫిన్ రక్తనాళాలను కుదించడం వలన రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 


కాఫీ విశేషాలు...

1. కాఫీ పంటను దాదాపు 70 దేశాలు పండిస్తున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా, దక్షిణ ఈశాన్య ఆసియా. ఆఫ్రికా ప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

2. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కాఫీ షాపు వెనిస్ నగరంలో 1683లో ప్రారంభమైంది. 

3. మక్కాలోని కాఫీ షాపుల్ని "కవే కేన్స్" అని పిలుస్తారు. 

4.  ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ బ్రాండ్ లండన్ కి చెందిన ఇన్సూరెన్స్ మార్కెట్ లాయిడ్స్ సంస్థ. 

5. నెస్‌కేఫ్‌ బ్రాండ్‌కు చెందిన ఈ కాఫీ వినియోగదారుల నుంచి 4.5 స్టార్స్‌ రేటింగ్‌ సాధించింది.

6.  ఉత్తమ ఇన్‌స్టెంట్‌ గుడ్ మార్నింగ్ కాఫీ. కాఫీతో తయారైన ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ కూడా మంచి రుచితో కమ్మగా ఉంటుంది. 

Updated Date - 2022-09-29T14:58:56+05:30 IST