కుండీల్లో కూరగాయలు!
ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవడంపై దృష్టి పెట్టొచ్చు...

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవడంపై దృష్టి పెట్టొచ్చు. కొద్దిగా శ్రద్ధ పెడితే ఒక ఫ్యామిలీకి సరిపోయే కూరగాయలను ఇంట్లోనే పండించుకోవచ్చు. అయితే ఆ పనిచేసే ముందు కుండీల ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందుగా సరైన సైజు కుండీలను ఎంచుకోవాలి. అయితే కాస్త పెద్ద సైజు కుండీలు ఎంచుకుంటే ఎక్కువ మట్టిని నింపడానికి వీలవుతుంది. మొక్కలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతాయి.
అదనపు నీరు బయటకు పోయేలా కుండీకి తప్పకుండా రంధ్రాలు ఉండాలి. నీళ్లు బయటకు పోకుండా నిలిచినట్టయితే మొక్కలు చనిపోతాయి.
కొత్తిమీర, పుదీనా, పాలకూర, చుక్కకూర, మెంతి వంటి ఆకుకూరలను పెంచుకోవడానికి లోతు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉన్న కుండీలు ఎంచుకోవాలి. ముల్లంగి, క్యారెట్ వంటి వాటిని కూడా వీటిలో పెంచుకోవచ్చు.
టొమాటో, మిర్చి, ఉల్లిపాయ, అల్లం, వంకాయ వంటి కూరగాయల మొక్కలను పెంచుకోవడానికి లోతు ఎక్కువగా ఉండే కుండీలు ఎంచుకోవాలి