Srilila : శ్రీలీలకు భలే ఛాన్స్‌!

ABN , First Publish Date - 2022-11-27T02:22:09+05:30 IST

’పెళ్లి సందడి’తో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది శ్రీలీల. వెంట వెంటనే రవితేజ, నితిన్‌ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొంది.

Srilila : శ్రీలీలకు   భలే ఛాన్స్‌!

’పెళ్లి సందడి’తో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది శ్రీలీల. వెంట వెంటనే రవితేజ, నితిన్‌ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొంది. ఇప్పుడు ఏకంగా మహేశ్‌ బాబు సరసన ఛాన్స్‌ దక్కించుకొంది. మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా పూజా హెగ్డేని ఇది వరకే ఎంచుకొన్నారు. మరో కథానాయిక పాత్ర శ్రీలీలకు దక్కింది. డిసెంబరులో చిత్రీకరణ మొదలు కానుంది. మహేశ్‌తో పాటుగా శ్రీలీల, పూజా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. ఇందులో ఓ ప్రత్యేక గీతం కూడా ఉండబోతోందని టాక్‌. ఆ పాట కోసం ఓ ప్రముఖ కథానాయిక పేరు పరిశీలనలో ఉంది. ఇది వరకే ఈ సినిమా కోసం ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ని కూడా రూపొందించారు. ఆ తరవాత.. కథ విషయంలో మార్పులూ, చేర్పులూ చోటు చేసుకొన్నాయి. ఇది వరకు రాసిన కథని పూర్తిగా పక్కన పెట్టి, మహేశ్‌ కోసం త్రివిక్రమ్‌ కొత్త కథ అల్లారని సమాచారం. అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం అలస్యమైంది. ఇప్పుడు కథ విషయంలో క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. నాన్‌ స్టాప్‌గా చిత్రీకరణ జరపాలని నిర్ణయించారు.

Updated Date - 2022-11-27T02:22:10+05:30 IST