ప్రైవేటు భాగాల ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కాలు

ABN , First Publish Date - 2022-06-01T02:16:15+05:30 IST

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అంతర్గత భాగాల శుభ్రత చాలా ముఖ్యమైనప్పటికీ ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు

ప్రైవేటు భాగాల ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కాలు

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అంతర్గత భాగాల శుభ్రత చాలా ముఖ్యమైనప్పటికీ ఈ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యను నివారించేందుకు శరీర ప్రైవేటు భాగాల పరిశుభ్రత ఎంతో అవసరం. చాలామంది స్త్రీలకు ప్రైవేటు భాగాల పరిశుభ్రత, సాధారణ శుభ్రత మధ్య వ్యత్యాసం గురించి తెలియదు. జననాంగం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రాథమిక ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతారు.


జననాంగం పరిశుభ్రతను కాపాడుకునేందుకు స్త్రీలు ఇంటిమేట్ వాష్‌ను ఉపయోగిస్తుంటారు. చాలామంది మహిళా వైద్యులు గోరువెచ్చని నీటిని ఇంటిమేట్ వాష్‌గా ఉపయోగించమని సిఫార్సు చేస్తుంటారు. వేసవిలో స్త్రీల సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అధిక చెమట కారణంగా అసౌకర్యానికి గురవుతారు. ఇది ఇలాగే కొనసాగితే అది UTIకి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి జననాంగ పరిశుభ్రత విషయంలో మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చంటారు హైదరాబాద్ కొండాపూర్‌లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి యూరాలిస్ట్, ఆండ్రాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంక్ సలేచా. 


ప్రతి ఒక్కరు నీటిని పుష్కలంగా తీసుకోవాలి. శరీరంలో నీరు తగినంత లేకపోతే హైడ్రేషన్ బారినపడడం ఖాయం. కాబట్టి తరచూ నీటిని తీసుకుంటూ ఉండాలి. నీరు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పీహెచ్ సమతౌల్యతను కాపాడుతుంది. అలాగే, జననాంగాన్ని గోరు వెచ్చటి నీటితో క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఉదయం, రాత్రి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. చెమట ఎక్కువగా పడితే దుస్తులను తరచూ మారుస్తుండాలి. 


అంతర్భాగాల ఆరోగ్యానికి ఆహారం కూడా ఎంతో కీలకం. మసాలాలతో నిండిని ఆహార పదార్థాలు, ఆల్కహాల్, టీ, కాఫీలు, శీతల పానీయలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఉక్కబోతగా ఉంటే చెమట పడుతుంది. కాబట్టి లోదుస్తులను క్రమం తప్పకుండా మారుస్తుండాలి. ఎక్కువ గంటలపాటు సింథటిక్ ఇన్నర్‌వేర్, లోదుస్తులను ధరించడం వల్ల రాపిడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి గాలి ఆడే దుస్తులు ధరించాలి. ప్రైవేటు భాగాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి.  

Read more