‘మా’ పనితీరుపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్‌!

ABN , First Publish Date - 2022-10-28T17:00:34+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) పనితీరుపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. గత ఏడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే!

‘మా’ పనితీరుపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) పనితీరుపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. గత ఏడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే! తాజాగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. విష్ణు అధ్యక్ష పదవిని అలకరించి ఏడాది మాత్రమే అయిందని, మరో ఏడాది ఆయనకు సమయం ఉందని అన్నారు. ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాఽధ్యత ఉంటుందని, విష్ణు అధ్యక్షుడిగా పనిచేశారా? లేదా? అన్నది ‘మా’ సభ్యులు అందరికీ తెలసని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచిన సందర్భంగా ఈ మధ్యనే ‘మా’ కోసం చేసిన పనులను ప్రకటించారు కదా! అన్న ప్రశ్నకు ‘‘90 శాతం పనులు చేశామని ప్రకటించడం వల్ల ఆ పనులు పూర్తయినట్లు కాదనీ, విష్ణు పదవీకాలం మరో ఏడాది ఉందని, ‘మా’ కోసం ఏం చేస్తారో చూద్దామని’’ ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు.. ‘ఇంకా సమయం ఉంది కదా! ఆలోచిస్తాను అని సమాధానమిచ్చారు. గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేసిన సంగతి తెలిసిందే! సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు.

Updated Date - 2022-10-28T17:00:41+05:30 IST