రెండు వేలకే నాయిస్‌ స్మార్ట్‌ వాచీ

ABN , First Publish Date - 2022-09-10T05:48:23+05:30 IST

నాయిస్‌ మరో స్మార్ట్‌ వాచీని ‘కలర్‌ఫిట్‌ పల్స్‌ గో బజ్‌’ పేరిట మన మార్కెట్లోకి విడుదల చేసింది. 1.69 ఇంచీల టీఎఫ్‌టీ డిస్‌ప్లే

రెండు వేలకే నాయిస్‌ స్మార్ట్‌ వాచీ

నాయిస్‌ మరో స్మార్ట్‌ వాచీని ‘కలర్‌ఫిట్‌ పల్స్‌ గో బజ్‌’ పేరిట మన మార్కెట్లోకి విడుదల చేసింది. 1.69 ఇంచీల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 150కి మించి క్లౌడ్‌ ఆధారిత కస్టమైజబుల్‌ వాచీ ఫేసులు, ట్రూసింక్‌ టెక్నాలజీతో వచ్చింది. సింగిల్‌-చిప్‌ బ్లూటూత్‌  వాచీ  కాగా ఐపి68 రేటింగ్‌ ఉంది. వాటర్‌ రెసిస్టెంట్‌ కూడా. కంపెనీ ఈ వారం విడుదల చేసిన రెండో వాచీ ఇది.  పాలీకార్బొనేట్‌ మెటీరియల్‌తో రూపొందించారు. 22.6ఎంఎం సిలికాన్‌ స్ట్రాప్స్‌తో ఈ వాచీ బరువు 23 గ్రాములు మాత్రమే. జెట్‌ బ్లాక్‌, మిడ్‌నైట్‌ బ్లూ, మిస్ట్‌ గ్రే, ఆలివ్‌ గ్రీన్‌, రోజ్‌ పింక్‌ కలర్‌ ఆప్షన్స్‌ ఈ వాచీల్లో ఉన్నాయి. 300ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉంది. 35 రోజుల స్టాండ్‌బై టైమ్‌ కూడా ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీని రేటు రూ.4,999. అయితే ప్రస్తుతం రూ.1,999 కే ఇస్తున్నారు. నాయిస్‌, అమెజాన్‌ వెబ్‌సైట్లను ఉంచి దీన్ని పొందవచ్చు.

Read more